విక్రమ్ సినిమా నుంచి సినీ జీవితాన్ని మొదలుపెట్టిన అక్కినేని నాగార్జున, ఇప్పటికీ నవమన్మధుడుగా అమ్మాయిల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇక ఈయన వైవాహిక జీవిత విషయానికి వస్తే, మొదట దగ్గుబాటి రామానాయుడు కూతురు లక్ష్మి ని, తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు కోరిక మేరకు వివాహం చేసుకున్న నాగచైతన్య జన్మించాడు. ఆ తర్వాత నాగార్జున.. అమలతో కొన్ని సంవత్సరాల పాటు డేటింగ్ కూడా చేశాడు. అయితే నాగార్జున.. అమలతో పూర్తిగా ప్రేమలో పడిపోయి, ఇక నాగచైతన్య తల్లి కి విడాకులు ఇవ్వడం జరిగింది.


అక్కినేని నాగార్జున అమలతో  ఎన్నో సంవత్సరాలు డేటింగ్ చేసి, ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత కూడా తన మన్మధ లీలలు విడిచి పెట్ట లేకపోయాడు. ప్రముఖ స్టార్ హీరోయిన్ టబు తో ప్రేమ వ్యవహారం నడిపాడని, ఆమెతో డేటింగ్ కూడా చేశాడు అనే వార్తలు కూడా వినిపించాయి. నిన్నే పెళ్ళాడుతా సినిమా లో కలిసి నటించిన  వీరిద్దరూ ఒకరికొకరు బాగా ఇంటరాక్ట్ అయ్యారు అనే వార్తలు కూడా గుప్పుమన్నాయి.. ఇక నాగార్జున ను ఎంతో ఇష్టపడిన టబు ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా నాగార్జున కలలతోనే జీవిస్తోంది అని సమాచారం.


అంతేకాదు నాగార్జునను మర్చిపోలేక.. నాగార్జున సాన్నిహిత్యం లో కొంత సమయం గడపాలి అని ఆమె అప్పుడప్పుడు హైదరాబాద్ కి కూడా వస్తుండేది అనే వార్తలు కూడా వినిపించాయి. ఇక్కడ ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే టబు 50 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ,  ఇప్పటికీ కూడా పెళ్లి చేసుకోకుండా.. పెళ్లి అని మాట అనగానే..నన్ను అర్థం చేసుకునే వ్యక్తి ఇంకా నాకు ఎదురు అవ్వలేదు.. అందుకే నేను పెళ్లి చేసుకోలేదు అంటూ కూడా మాట మార్చేస్తూ తప్పుకుంటుంది. ఇక వీరిద్దరి మధ్య ఎంతవరకు ప్రేమ వ్యవహారం ఉందో లేదో తెలియదు కానీ.. మీడియా మరియు సినీ ఇండస్ట్రీలో మాత్రం వార్తలు హాట్ టాపిక్ గా మారి ఎప్పటికప్పుడు చక్కర్లు కొడుతూనే ఉంటాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: