టాలీవుడ్ సినిమా పరిశ్రమలో దర్శకుడి గా నిలదొక్కుకోవాలంటే ఎంతో కష్టపడాలి. దర్శకత్వం లో అన్ని మెళకువలు నేర్చుకున్న తర్వాత అద్భుతమైన కథను రెడీ చేసుకుని హీరో నీ ఒప్పించగలగాలి. మన టాలీవుడ్ లో ట్రంక్ పెట్టే లో వందలకొలది కథలు పట్టుకొని వచ్చి సినిమాలు చేసిన దర్శకులు ఉన్నారు. అలాగే కంప్యూటర్లో టైప్ చేసుకొని అద్భుతమైన కథలను రెడీ చేసుకున్న దర్శకు లు కూడా టాలీవుడ్ లో ఉన్నారు. ఈ విధంగా వచ్చిన కూడా మంచి సినిమా లు చేసి ప్రేక్షకులను అలరించడమే వారి అల్టిమేట్ టార్గెట్.

ఆ విధంగా ప్రేక్షకులను తన సినిమాలతో విపరీతంగా అలరించిన దర్శకుడు పూరి జగన్నాథ్. మొదటి నుంచి ప్రేక్షకులకు కొత్త రకమైన కథలను పరిచయం చేయడంలో సక్సెస్ అయ్యాడు. అప్పటి వరకు ఉన్న మూసలో వెళుతున్న సినిమాలను కాదని పూరి జగన్నాథ్ తనదైన రచన టాలెంట్ తో డైరెక్షన్ తో ప్రేక్షకులకు కొత్త రకం సినిమా ఎక్స్పీరియన్స్ ను అందించాడు. ఆ విధంగా ఆయన కథలను మెచ్చిన చాలా మంది హీరోలు పూరిజగన్నాథ్ తో ఒకటి కాదు రెండు సార్లు మూడు సార్లు అవకాశం ఇచ్చారు.

అయితే తెలుగు తెరపై హీరో లను సరికొత్తగా చూపించడం లో పూరి జగన్నాథ్ పెట్టింది పేరు. ఆయన సినిమాల్లో హీరోలు ఇతర సినిమాలలోని హీరోలలా కాకుండా వెరైటీగా కనిపిస్తారు. వారి పాత్ర ఎంతో వెరైటీగా చిత్రీకరించి వారి అభిమానులకు బాగా నచ్చే విధంగా రూపొందిస్తాడు. ఆయన సినిమాలోని ప్రతి హీరో పాత్ర కూడా సరి కొత్తగా చూపించి హీరోల పాత్రలు బాగా డిసైడ్ చేసే దర్శకుడిగా పేరు సంపాదించుకున్నాడు పూరి జగన్నాథ్. అందుకే ఆయన సినిమాలు ఫ్లాప్ అయినా కూడా పెద్దగా పట్టించుకోరు హీరోలు. పూరి జగన్నాథ్ సినిమా లో హీరోగా చేయడం అదృష్టంగా భావిస్తూ ఉంటారు

మరింత సమాచారం తెలుసుకోండి: