‘మైనే ప్యార్ కియా’  మూవీతో భాగ్యశ్రీ తన తొలి చిత్రంతోనే దేశవ్యాప్తంగా సెలిబ్రిటీగా మారిపోయింది. ఆతరువాత అప్పట్లో ఆమెకు అనేక  అవకాశాలు వస్తున్నా వాటిని కాదనుకుని పెళ్ళి చేసుకుని ఫిలిం ఇండస్ట్రీకి దూరం అయింది. దాదాపు మూడు దశాబ్దాల అనంతరం మళ్ళీ   ఆమె ప్రభాస్ ‘రాధేశ్యామ్’ లో నటిస్తూ ఉండటం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ  హాట్ టాపిక్ గా మారింది.  


లేటెస్ట్ గా ఈమె ఒక  మీడియా సంస్థకు ఇచ్చిఇన ఇంటర్వ్యూలో ఈమె   ‘రాధేశ్యామ్’ లో తన పాత్ర గురించి ఆ పాత్ర ప్రాముఖ్యత గురించి పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించింది. అందరు అనుకుంటున్నట్లుగా ‘రాదేశ్యామ్’ మూవీలో తనది తల్లి పాత్ర కాదని చాల కీలకమైన పాత్ర అని లీకులు ఇచ్చింది. అంతేకాదు  తన పాత్ర లేకపోతే ‘రాధేశ్యామ్’ సినిమా లేదని తన పాత్రను తగ్గిస్తే ఆ సినిమాకు సమస్య అవుతుందని ప్రభాస్ పాత్రతో సమానంగా ఉంచారు అని కామెంట్స్ చేసింది.


ఇదే ఇంటర్వ్యూలో  మరొక ట్విస్ట్ ఇస్తూ  ఈ మూవీలో తన పాత్ర కొన్ని సందర్భాలలో ప్రభాస్ ను డామినేట్ చేస్తుందని కామెంట్స్ చేసింది. ఈసినిమా షూటింగ్ సమయంలో ప్రభాస్ తనకు ఒక తమ్ముడుగా మారిపోయాడని తనకు ఆంధ్రా వంటకాలను రుచి చూపించడమే కాకుండా తాను మాటవరసకు అడిగిన పూతరేకులను 200 వందల సంఖ్యలో తన ఇంటికి గిఫ్ట్ బాక్స్ లో పంపిన ప్రభాస్ తనకు చాల ఆత్మీయుడు అని అంటోంది. ఇదే సందర్భంలో ఈ సినిమాలోని సెట్స్ గురించి మాట్లాడుతూ ఈసినిమా కోసం వేసిన సెట్స్ ఒక ట్రెండింగ్ గా మారుతాయని అంటోంది. భవిష్యత్ లో తాను మరిన్ని సినిమాలు చేస్తానో లేదో తనకు తెలియదని ‘ప్రేమపావురాలు’ తువాత తన కెరియర్ లో ఒక ట్రెండ్ సెటర్ గా ఈమూవీ ఉండబోతోంది అని జోస్యం చెపుతోంది. ఈమె చెపుతున్న ఈ కామెంట్స్ ను బట్టి ఈమూవీ పై మరన్ని అంచనాలు పెరుగుతున్నాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: