ప్రస్థుతం తమిళ తెలుగు ఇండస్ట్రీలలో పూజ హెగ్డే మ్యానియా కొనసాగుతోంది. పూజ టాలీవుడ్ లో 6 సినిమాలలో నటిస్తూ అటు కోలీవుడ్ లో కూడ టాప్ హీరోలు అందరితోను నటిస్తోంది. దీనితో ఆమె హైదరాబాద్ చెన్నైల మధ్య తిరుగుతూ ఒకొక్కరోజు ఒకొక్కచోట ఉంటూ నిద్రపోవడానికి సమయం చాలకపోతే విమానాలలోనే నిద్రపోతోంది.
ఆమె మ్యానియా తారా స్థాయికి చేరిపోవడంతో ఆమె డేట్స్ ఇస్తే చాలు నిర్మాతలు 2కోట్లు పైగా ఇస్తామని ఆమె చుట్టూ తిరుగుతున్నారు అంటే ప్రస్తుతం ఆమె రేంజ్ ఎలా ఉందో అందరికి తెలుసు. ఈమధ్య ఆమె చాల బిజీ కావడంతో ఆమె డేట్స్ దొరకక ప్రభాస్ లాంటి టాప్ హీరోలు కూడ ‘రాథే శ్యామ్’ షూటింగ్ సమయంలో సమస్యలకు లోనవ్వడంతో పాటు ఈ విషయమై ప్రభాస్ పూజాల మధ్య చిన్న భేధాభిప్రాయాలు కూడ వచ్చాయి అన్న వార్తలు వినిపించాయి.
లేటెస్ట్ గా ఈమె తమిళ సూపర్ స్టార్ విజయ్ తో ‘బీస్ట్’ అనే భారీ సినిమాలో నటిస్తోంది. ప్రముఖ తమిళ దర్శకుడు నెల్సన్ దర్శకత్వం వహిస్తున్న ఈమూవీ పై అత్యంత భారీ అంచనాలు ఉన్నాయి. ఈమూవీ షూటింగ్ కోసం ఈమధ్య ఈమధ్య ఈమె ముంబాయి నుండి చెన్నై ఎయిర్ పోర్టు లోకి ట్రెండీ లుక్ తో ఎంటర్ అయింది. ఆవపిండి కలర్ లో ఉన్న ఓవర్ కోట్ ఫేస్ మాస్క్ తో నల్లటి దుస్తుల్లో కనిపిస్తూ బాటమ్ లో కాంబినేషన్ బూట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
దీనితో ఎయిర్ పోర్ట్ లో ఉన్నవారంతా పూజ డ్రెస్ స్టైల్ పై దృష్టి పెట్టి తమ సెల్ ఫాన్స్ లో ఆమె ట్రెండీ లుక్ ను ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఇప్పుడు ఆఫోటోలు వైరల్ గా మారాయి. సాధారణంగా త్రివిక్రమ్ తన సినిమాలలో ఒక హీరోయిన్ కు వరసగా అవకాశాలు ఇవ్వడు. అయితే పూజకు కొనసాగుతున్న మ్యానియా రీత్యా ఆమెను ముచ్చటగా మూడవసారి మహేష్ తో తీస్తున్న సినిమాకు ఎంపిక చేసాడు అంటే ఆమె క్రేజ్ ఏస్థాయిలో ఉందో అర్థం అవుతోంది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి