టాలీవుడ్
సినిమా పరిశ్రమలో
కమెడియన్ సునీల్ మంచి స్టార్
కమెడియన్ గా ఉన్నప్పుడే ఆయన హీరోగా ఎంట్రీ ఇచ్చి కొన్ని సినిమాలతో విజయాలు సాధించి ఆ తర్వాత ప్లాప్ సినిమాలతో హీరోగా ప్రేక్షకులను నిరాశ పరిచేశాడు. దాంతో ఆయన మళ్ళీ కమెడీయన్ అని చెప్పి
కామెడీ పాత్ర లు చేస్తున్నాడు. అయితే ఆయన
కామెడీ మాత్రమే చేయాలి కానీ ఆయన కూడా ఇతర పాత్ర లను ఎంచుకోవడంతో ఆయనను అసలే స్క్రీన్ పై చూడలేకపోతున్నారు ప్రేక్షకులు. విలన్ పాత్రలను పోషిస్తూ
సునీల్ తన
కామెడీ ఇమేజ్ ను దెబ్బ తీసుకుంటున్నాడు.
హీరో అయినప్పుడు ఏ విధమైన తప్పు చేశాడో ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి అదే తప్పు చేస్తున్నాడు సునీల్. వాస్తవానికి
సునీల్ కమెడియన్ గా మాత్రమే బాగుంటాడు. వేరే ఏ పాత్ర చేసినా అది ఆయనకు సూట్ కాదు. ఈ విషయం ఆయనకు ఎవరూ చెప్పట్లేదో ఏమో ఆయన మాత్రం ఇదే విధంగా ప్రేక్షకులను నిరాశపరుస్తూ వెళుతున్నాడు. తాజాగా ఆయన మళ్లీ హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఆయన చిరకాల మిత్రుడు
త్రివిక్రమ్ తో కలిసి ఓ
సినిమా చేయబోతున్నాడు
సునీల్ అని తెలుస్తుంది. అయితే ఈ చిత్రానికి
త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తాడా సహకారం మాత్రమే చేస్తాడా అనేది చూడాలి.
కెరీర్ తొలినాళ్లలో వీరిద్దరూ ఒకే ఇంటిలో ఉండి
సినిమా అవకాశాల కోసం తిరిగేవారు అలా ఈ ఇద్దరూ తమ తమ విభాగాలలో స్టార్ గా ఎదిగిన తర్వాత అందాల రాముడు చిత్రం చేసి సూపర్ హిట్ అందుకున్నాడు
హీరో గా సునీల్. నిజానికి ఆ సినిమాతోనే
సునీల్ హీరో అయ్యాడు. ఆ సినిమాతో వచ్చిన ఇమేజ్ తో హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేయగా ఆ తర్వాత దాన్ని నిలబెట్టుకోలేక పోయాడు. మరి ఇన్నాళ్ల తర్వాత స్నేహితుడి కోసం
త్రివిక్రమ్ తన స్టార్ ఇమేజ్ ను పక్కన పెట్టి
సునీల్ తో
సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. మరి
త్రివిక్రమ్ లాంటి స్నేహితుడు రిస్క్
సునీల్ కెరీర కు ఏ విధంగా ఉపయోగపడుతుందో చూడాలి. ఇకపోతే
త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ బాబు 28వ
సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది ఈ సినిమాలో కూడా
సునీల్ కోసం ఓ మంచి పాత్ర రాశాడట.