పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నాలుగు సినిమాలు ఒకేసారి చేస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆశ్చర్యపరుస్తున్నాడు.  ఇప్పటికే వకీల్ సాబ్ సినిమాను విడుదల చేసి సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న పవన్ భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకులను త్వరలోనే అలరించనున్నాడు.  సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు పవన్ కళ్యాణ్. సాగర్ చంద్ర దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ రచయిత కాగా మరో కథానాయకుడిగా రానా నటిస్తూ ఉండగా మలయాళంలో సూపర్ హిట్టయిన అయ్యప్పనుం కోషియం సినిమాకు ఇది రీమేక్.

ఇక ఈ సినిమాతో పాటే క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ను చేస్తున్నాడు. ఇది పూర్తయిన వెంటనే హరీష్ శంకర్ భవదీయుడు భగవద్గీత అనే సినిమా చేయనున్నాడు. అలాగే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కాల్సిన సినిమా ఎలాగూ ఉంది. ఈ విధంగా పవన్ సినిమాలతో తన క్యాలెండర్ ను ఫుల్ బిజీగా మార్చుకోగా ఇప్పుడు వాటితో పాటు మరో సినిమా కూడా యాడ్ అయ్యిందనే అనే వార్త టాలీవుడ్ లో తెగ ప్రచారం అవుతోంది. 

ఇటీవలే రిపబ్లిక్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు దేవాకట్టా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సోషల్ మెసేజ్ తో సినిమాలు చేయడంలో ఆరితేరి పోయాడు.  ప్రస్తుతం అలాంటి సినిమాలు చేయవలసిన ఆవశ్యకత పవన్ కళ్యాణ్ కు ఉండడంతో రిపబ్లిక్ సినిమాను చూసిన పవన్ కళ్యాణ్ దేవాకట్టా తనకు ఓ పవర్ ఫుల్ పొలిటికల్ మెసేజ్ ఓరియంటెడ్ సినిమా సిద్ధం చేయమని కోరారట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోసం ఒక అదిరిపోయే కథను తయారు చేసే పనిలో పడ్డాడు దేవా. పొలిటికల్ సర్కిల్ లో ప్రజలకు జరుగుతున్న అన్యాయాల గురించి దాన్ని ఎదిరించే ఒక రాజకీయ నాయకుడు పుట్టడం గురించి ఈ సినిమా కథ ఉండబోతుందట. దేవాకట్టా పెన్ పవర్ చూసిన పవన్ కళ్యాణ్ డైరెక్షన్ లో ఓ సినిమా చేసి దాంతో ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: