టాప్ యంగ్ హీరోలు ప్రభాస్ మహేష్ అల్లు అర్జున్ జూనియర్ లు ‘మా’ ఎన్నికల రాజకీయాలను పట్టించుకోకుండా వారి సినిమాలను వారు చేసుకుంటూ కాలం గడుపుతున్నారు. అయితే ఇప్పుడు వీరిని కూడ ‘మా’ ఎన్నికల వివాదాలలోకి లాగుతున్నారు.


మంచు విష్ణు ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్ జూనియర్ మహేష్ బన్నీలు తనకు మాత్రమే ఓటు వేస్తారు అంటూ ఒక సరికొత్త మైండ్ గేమ్ కు తెరతీసారు. కొన్నిరోజుల క్రితం జీవిత ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ ప్రస్తుతం ‘మా’ సంస్థలో జరుగుతున్న రాజకీయాలను చూసి విసికిపోయిన జూనియర్ ఎన్నికల రోజున ఓటు వేయడానికి తాను రాను అని చెప్పాడు అంటూ ఆమె మరొక సంచలనానికి తెర తీసారు.


అయితే దీనికి కౌంటర్ ఎటాక్ గా విష్ణు సరికొత్త మైండ్ గేమ్ కు టాప్ హీరోల ఓట్లు అన్నీ తనకు మాత్రమే అంటూ ప్రకాష్ రాజ్ ను ఇరుకున పెట్టడానికి ప్రయత్నించాడు. వాస్తవానికి ప్రకాష్ రాజ్ టాప్ యంగ్ హీరోలకు సంబంధించిన అనేక బ్లాక్ బష్టర్ సినిమాలలో నటించాడు. విష్ణు టాప్ యంగ్ హీరోల సినిమాలలో నటించనప్పటికీ చిన్నప్పటి నుండి వారందరితోనూ తనకు సాన్నిహిత్యం ఉండటంతో వారంతా తనకు ఓటు వేస్తారు అన్న నమ్మకంలో ఉన్నాడు.


అయితే ఇంత సున్నిత వ్యవహారాన్ని తప్పించుకోవడానికి టాప్ హీరోలు అంతా ఈసారి మా ఎన్నికల పోటీకి దూరం అయ్యే పరిస్థితులు చాల స్పష్టంగా కనిపిస్తున్నాయి అన్న అంచనాలు వస్తున్నాయి. దీనితో మంచు విష్ణు చెపుతున్న మాటలు మితిమీరిన ఆత్మ విశ్వాసమా లేదంటే టాప్ యంగ్ హీరోలు అంతా నిజంగానే విష్ణుకి మాట ఇచ్చారా అన్న కోణంలో ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. మరొక వైపు మంచు విష్ణు ప్రకటించిన మ్యానిఫెస్టో చూసిన వారు ఇన్ని పధకాలు అమలు జరపడానికి ‘మా’ సంస్థలో అన్ని నిధులు ఉన్నాయా అంటూ ఆశ్చర్య పోతున్నారు..




మరింత సమాచారం తెలుసుకోండి: