హీరోయిజంతో పాటు కామెడీని కూడా 100% పండించడంలో దిట్ట విక్టరీ వెంకటేష్. అన్ని వర్గాల ప్రేక్షకులు చూడగలిగే కథలను ఎంచుకుంటూ ఫ్యామిలీ హీరోగా గుర్తింపు పొందిన ఈ సీనియర్ హీరో రూట్ సెపరేటు. హీరో అంటే కేవలం యాక్షన్, డైలాగ్స్ , ఫైట్స్ మాత్రమే కాదు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించగలగాలి అని నమ్మే వ్యక్తి వెంకటేష్. ఈయన చిత్రంలో సెపరేట్ గా కామెడీ డైలాగ్స్ రాయాల్సిన అవసరం లేదు. స్వతహాగా ఎక్కడ ఏ డైలాగ్ ఎలా పలికి కామెడీ పండించాలో బాగా తెలిసిన వెంకీ. వెంకీ సినిమాలు వస్తున్నాయి అంటే ప్రేక్షకులకు పండగే పండగ..ఒక్క విక్టరీ వెంకీ అభిమానులే కాదు, అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమా చూడటానికి రెడీ అయిపోతారు అంతగా ఆయన సినిమాలలో తన యాక్షన్ తో కామెడీ పంచ్ లతో ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తారు వెంకీ.

సినిమా అంటే ప్రధానంగా ఎంటర్ టైన్ మెంట్..అయితే ఆడియన్స్ ని ఫుల్ గా మూడు గంటలపాటు ఎంటర్టైన్ చేయడంలో విక్టరీ వెంకటేష్ దిట్ట అని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అటు నటనలోను యాక్షన్ లోను ప్రధానంగా కామెడీ టైమింగ్ తో అదరగొట్టగల హీరో వెంకీ. ప్రేమ, వారసుడొచ్చాడు, కలిసుందాం రా, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే ఇలా అప్పటి నుండి నేడు గోపాల గోపాల, బాబు బంగారం  F2  వరకు కూడా చూస్తే దాదాపుగా ప్రతి సినిమాలోనూ తనదైన శైలిలో కామెడీని పండించి ప్రేక్షకుల పెదవులపై నవ్వుల పువ్వులు పూయిస్తాడు వెంకీ. ముఖ్యంగా  "నువ్వు నాకు నచ్చావ్" చిత్రంలో వెంకీ కామెడీ అంతా ఇంతా కాదు.  

ఈ సినిమా వచ్చి  ఇరవై ఏళ్లు గడుస్తున్నా కొన్ని వందల సార్లు ఈ సినిమాను చూసినా ఇప్పటికీ టీవిలో ఈ సినిమా వస్తుందంటే ప్రేక్షకులు చూడడానికి రెడీ అయిపోతారు. పదే పదే చూసిన బోర్ కొట్టని చిత్రాలలో నువ్వు నాకు నచ్చావ్ చిత్రం ఒకటి. ఇందులో మేజర్ ఎలిమెంట్ వెంకీ పండించిన కామెడీ అనే చెప్పాలి. ఈ సినిమాలో  బ్రహ్మానందం, సునీల్ వంటి కమెడియన్స్  తో కలసి వెంకీ చేసిన కామెడీ సందడి వేరే లెవల్ లో ఉంటుంది. ఈ సినిమాలో తన కామెడీ టైమింగ్ తో నవ్వుల సునామీ తెప్పించాడు విక్టరీ వెంకటేష్. ఇలా ఆ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది అంతగా ప్రేక్షకుల్ని అలరిస్తుంది నువ్వు నాకు నచ్చావ్ చిత్రం.

మరింత సమాచారం తెలుసుకోండి: