ఆఖరి క్షణం వరకు సస్పెన్స్ సినిమాను తలపించిన ‘మా’ ఎన్నికలలో ఎన్నో ట్విస్ట్ లు ఉన్నాయి. ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు 100 ఓట్లకు పైగా భారీ మెజారిటీ సాధించడానికి ఒకవిధంగా పవన్ ‘రిపబ్లిక్’ మూవీ ఈవెంట్ లో చేసిన కామెంట్స్ సహకరించాయ అన్న ఆసక్తికర చర్చలు ఇండస్ట్రీ వర్గాలలో జరుగుతున్నాయి.
‘రిపబ్లిక్’ మూవీ ఈవెంట్ జరిగే వరకు మంచు విష్ణు ప్రకాష్ రాజ్ ల మధ్య పోటీ ‘మా’ సంస్థ సభ్యులు అదేవిధంగా ఇండస్ట్రీ వర్గాలు చాల లైట్ గా తీసుకున్నాయి. ప్రకాష్ రాజ్ కు మెగా కాంపౌండ్ సపోర్ట్ కూడ ఉండటంతో ప్రకాష్ రాజ్ గెలుపు చాల సులువు అని అంతా భావిస్తూ వచ్చారు. ‘రిపబ్లిక్’ మూవీ ఫంక్షన్ లో పవన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆన్ లైన్ టిక్కెటింగ్ వ్యవహారంలో టిక్కెట్ల రెట్లు పెంపు విషయంలో అనుసరిస్తున్న విధానాల పై చాల తీవ్రమైన వ్యాఖ్యలు చేయడంతో ఇండస్ట్రీ వర్గాలు పవన్ వ్యాఖ్యలతో ఏకీభవించలేకపోయాయి.
దీనితో ఇండస్ట్రీ రెండు ముక్కలుగా విడిపోయి మెగా కాంపౌండ్ కు అనుకూలంగా ఒక వర్గం వ్యతిరేకంగా ఒక వర్గం మళ్ళీ తమ వర్గ పోరును మొదలు పెట్టారు. ఇలాంటి పరిస్థితులలో మంచు విష్ణు తెలివిగా పవన్ వ్యాఖ్యలను ఖండించి మెగా కాంపౌండ్ ను వ్యతిరేకించే ఒక కీలక వర్గం సపోర్ట్ పొందగలిగాడు అన్న కామెంట్స్ వస్తున్నాయి.
అయితే ఈ విషయంలో ప్రకాష్ రాజ్ తడబాటుకు గురై పవన్ వ్యాఖ్యలను ఖండించక పోవడంతో అతడు గెలిచినా మెగా కాంపౌండ్ సూచనలకు అనుగుణంగా ఉంటాడు కానీ తన వ్యక్తిత్వాన్ని బయట పెట్టలేదు అన్న వాదానికి బలం చేకూరింది. దీనికితోడు ‘మా’ ఎన్నికల ప్రారంభం వరకు చాప కింద నీరులా ఉన్న మెగా కాంపౌండ్ అనుకూల ప్రతికూల వర్గాలు మళ్ళీ బయట పడటంతో మెగా కాంపౌండ్ వ్యతిరేకులను మంచు విష్ణు మోహన్ బాబు ఆశీస్సులతో చాల తెలివిగా కూడ కట్టుకొవడంతో ఇలాంటి భారీ మెజారిటీ మంచు విష్ణు విజయానికి కారణం అయింది అన్న విశ్లేషణలు వస్తున్నాయి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి