కానీ ఈ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వలేక పోవడంతో ఈమెపై ఐరన్ లెగ్ అనే ముద్ర వేశారు. ఇక ఆ తరువాత చాలా రోజులకు అల్లు అర్జున్ తో కలిసి డీజే- దువ్వాడ జగన్నాథం సినిమా లో నటించి తనలో ఉండే డాన్స్ టాలెంట్ ని చూపించి, తన గ్లామర్తో ప్రేక్షకులను అలరించింది. ఇక ఆ తర్వాత ఈ అమ్మడు ఇక వరుస ఆఫర్లతో దూసుకుపోతూ వచ్చింది. స్టార్ హీరోల సరసన ఈమే నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
ఇక ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో నాలుగు సినిమాలు, తమిళంలో ఒకటి, హిందీ భాషలో మూడు సినిమాలలో నటించనుంది. ఇక ఈమె నటించిన రీసెంట్ సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ దసరాకి విడుదల కానుంది. ఆచార్య సినిమాలో కూడా విభిన్నమైన పాత్రల్లో నటించింది ముద్దుగుమ్మ.
కోలీవుడ్ స్టార్ హీరో అయినటువంటి విజయ్ దళపతి తో కూడా పూజాహెగ్డే ఒక సినిమాలో కనిపించనుంది. తన మొదటి సినిమా మాస్క్ తర్వాత తమిళ్ లో చేసినటువంటి రెండో సినిమా ఇది.ఇక హాలీవుడ్ హీరో రణవీర్ సింగ్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ వంటి హీరోలతో ఒక్కొక్క సినిమాలో నటించనుంది. ఇక టాలీవుడ్ లో అయితే ఏకంగా స్టార్ హీరోల సరసన నుంచి కుర్ర హీరోల వరకూ అందరితోనూ జతకడుతోంది ఈ భామ. అయితే ఐరన్ లెగ్ అన్న వాళ్ళు ఇప్పుడు మేము లక్కీ గర్ల్ గా పిలుస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి