అక్కినేని యంగ్ హీరో అఖిల్, పూజా హెగ్డే జంటగా నటించిన తాజా చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'.బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గత మూడు రోజుల క్రితం దసరా కానుకగా అక్టోబర్ 15 న విడుదలై పాజిటివ్ టాక్ తో పాటూ మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.అయితే ఈ సినిమా వచ్చే నెల 12 వ తేదీన ఓటిటి వేదిక అయిన ఆహాలో స్ట్రీమింగ్ కానుందంటూ జోరుగా వార్తలు ప్రచారమవుతున్నాయి.నాగ చైతన్య లవ్ స్టోరీ సినిమా ఆహా ఓటిటిలో విడుదల అయిన నాలుగు వారాలకు స్ట్రీమింగ్ కాగా.. ఇప్పుడు అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కూడా అదే తరహాలో విడుదల కానుందని సోషల్ మీడియాలో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

అయితే ఈ విషయంపై గీతా ఆర్ట్స్ కు సన్నిహిత నిర్మాతలతో ఒకరైన శ్రీనివాస్ కుమార్ స్పందిస్తూ..ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదని చెప్పుకొచ్చారు.మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా మరింత ఆలస్యంగా ఓటిటిలో రిలీజ్ అవుతుందని ఆయాన వెల్లడించారు.అయితే అఖిల్ అభిమానులు మాత్రం సినిమా రిలీజైన ఎనిమిది వారాల తర్వాత ఓటిటిలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.ఇక రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా యువతను బాగా ఆకట్టుకుంటోంది.ఇక చాలా సంవత్సరాల తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో దర్శకుడిగా బొమ్మరిల్లు భాస్కర్ మంచి హిట్ అందుకున్నారు.

 అటు అఖిల్ కూడా వరుస పరాజయాల తర్వాత హిట్ ని సొంతం చేసుకున్నాడు. అయితే అఖిల్ కి ఈ సినిమా కోరుకున్న స్థాయిలో హిట్ కాకపోయినా.. తన కెరీర్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మాత్రం మొదటి హిట్ అని చెప్పొచ్చు.ఇక ఇప్పటికే వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న పూజా హెగ్డే..ఈ సినిమాతో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకుంది.ఇక ఈ సినిమా అనంతరం అఖిల్ ..సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'ఏజెంట్' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం అఖిల్ డిఫరెంట్ బాడీ మెకోవర్ ని ట్రై చేస్తున్నాడు.అందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ కి భారీ రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇక ఈ సినిమాతో అఖిల్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుంటాడేమో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: