‘మా’ సంస్థ ఎన్నికల వ్యవహారం రగిల్చిన రోజుకు ఒక ట్విస్ట్ తీసుకుంటూ అందరిలోనూ ఆసక్తిని పెంచుతోంది. ఈ రగడ ఇలా కొనసాగుతూ ఉండగా సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలోని వర్గ పోరుకు సహకరించే విధంగా ఉన్నాయి అంటూ కొందరు అభిప్రాయ పడుతున్నారు.


తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో 1978 తరువాత ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఎవరు ఎదిగినా అది ఇండస్ట్రీలో ఉన్న 95 శాతం మంది కమ్మవారి సహకారంతోనే అంటూ తాను కూడ ఇండస్ట్రీలో ఎదగడానికి పరోక్షంగా ఎంతోమంది కమ్మ సామాజిక వర్గ నిర్మాతలు దర్శకులు సహకరించారు అంటూ కామెంట్స్ చేసాడు. ఇప్పుడు ఈ కామెంట్స్ ఇండస్ట్రీలో కలకలం సృష్టిస్తున్నాయి.


1978వ సంవత్సరంలో కోట ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ అదే సంవత్సరం చిరంజీవి కూడ ఎంట్రీ ఇచ్చాడు. వాస్తవానికి చిరంజీవి ఇప్పుడు ఇండస్ట్రీని శాసించే టాప్ హీరోగా ఎదిగినప్పటికీ ఆ ఎదుగదల వెనుక కమ్మ సామాజిక వర్గ దర్శక నిర్మాతల సహకారం ఉంది అంటూ కోట పరోక్షంగా చిరంజీవిని టార్గెట్ చేస్తూ ఈ కామెంట్స్ చేసాడా అన్న భావన కొంతమందిలో ఉంది. మా ఎన్నికల వంకతో ఇండస్ట్రీ ఇప్పటికే రెండు ముక్కలుగా అయిపోయింది అంటూ కొందరు బాధ పడుతున్నారు.


ఇప్పుడు కోట శ్రీనివాసరావు లాంటి సీనియర్ నటులు కూడ తమ మాటలలో కుల ప్రస్తావన తీసుకు రావడంతో రానున్న రోజులలో ఇండస్ట్రీలో ఈ కులం మ్యానియా మరింత పెరుగుతుంది కానీ తగ్గే సూచనలు లేవు అంటూ మరికొందరి ఆవేదన. ఇది ఇలా ఉంటే కోట టివి లో ప్రసారం అవుతున్న ‘జబర్దస్త్’ కామెడీ షో పై కూడ వేసిన సెటైర్లు హాట్ టాపిక్ గా మారాయి. ఆ షోను తాను చాల సార్లు చూశానని అది కామెడీ షోగా కాకుండా ఒక సర్కసు లా తనకు అనిపించింది అంటూ పడిపోతున్న విలువల పై ఘాటైన సెటైర్లు వేసాడు కోట..    


మరింత సమాచారం తెలుసుకోండి: