నటసింహ నందమూరి బాలకృష్ణ బుల్లితెరపై సందడి చేయడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. ప్రముఖ ఓటీటీ 'ఆహా' కోసం బాలకృష్ణ 'అన్ స్టాపబుల్' అనే టాక్ షో చేయబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది. చిరంజీవి నాగార్జున ఎన్టీఆర్ తరహాలో బాలయ్య కొత్త గా ఓటీటీ షో ద్వారా బుల్లితెరను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ టాక్ షోని నిర్మిస్తున్నారు. దీనికి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక తాజాగా ఈ షో ప్రసారమయ్యే తేదీని 'ఆహా' ప్రకటించింది. నవంబర్ 4 వ తేదీ నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది అంటూ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు.

బాలయ్య మొదటి టాక్ షో ఇదే కావడంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈ షో ప్రత్యేకత ఏమిటి అంటే.. కొందరు స్టార్ సెలబ్రిటీలను బాలయ్య తనదైన శైలిలో ఇంటర్వ్యూ చేస్తారు. ఈ టాక్ షో లో మొత్తం 12 ఎపిసోడ్లు ఉంటాయని సమాచారం. ఒక్కొక్క ఎపిసోడ్ కి 40 లక్షల రూపాయల చొప్పున బాలకృష్ణ పారితోషకం తీసుకుంటున్నాడు. అంటే మొత్తం 12 ఎపిసోడ్ లకు సుమారు ఐదు కోట్ల రూపాయల వరకూ బాలయ్యకు దక్కనుంది తెలుస్తోంది. బాలకృష్ణ ఇప్పటివరకు సినిమాలకు కూడా అంత భారీ పారితోషికం తీసుకోలేదు. దీన్నిబట్టి బాలయ్యకు ఈ టాక్ షో క్రేజ్ తో పాటు క్యాష్ కూడా భారీగానే లభించనుంది అని చెప్పవచ్చు.

నవంబర్ 4 నుంచి ప్రసారం కాబోయే తొలి ఎపిసోడ్లో బాలకృష్ణ ఎవరిని ఇంటర్వ్యూ చేస్తారు అనేది ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో ఆరంభ ఎపిసోడ్లో మోహన్ బాబు, విష్ణు మంచు లక్ష్మి, మనోజ్ పాల్గొంటారని సమాచారం. మిగతా ఎపిసోడ్స్ లో నాగార్జున, నాగచైతన్య, అఖిల్ కలిసి ఉన్నట్లుగా తెలుస్తోంది. మెగా ఫ్యామిలీకి చెందిన మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కూడా కలిసి పాల్గొంటారని సమాచారం.ఇక వెండితెరపై బాలయ్య సినిమా విషయానికొస్తే.. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో అఖండ అనే సినిమాని పూర్తి చేశాడు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. మరి కొద్ది రోజుల్లోనే ఈ సినిమాని విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇక దీని అనంతరం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 105వ సినిమా బాలకృష్ణ...!!

మరింత సమాచారం తెలుసుకోండి: