ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పలు రకాల మల్టీస్టారర్ ప్రాజెక్టులు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అందులో ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న మల్టీస్టారర్ సినిమా 'భీమ్లా నాయక్' పవర్ స్టార్ పవన కళ్యాణ్, దగ్గుపాటి రాణా ల కాంబినేషన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. దర్శకుడు సాగర్ కే చంద్ర మలయాళంలో హిట్టయిన అయ్యప్పనున్ కోషియం అనే సినిమాకి తెలుగు రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.

 ఇక ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్స్, టీజర్స్,పాటలకు ప్రేక్షకుల్లో భారీ స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ప్రమోషన్ విషయంలో చిత్రయూనిట్ ఎక్కడా తగ్గడం లేదు. షూటింగ్ మధ్య మధ్యలో ఈ సినిమాకు సంబంధించి కొన్ని పోస్టర్స్ ను అభిమానులతో పంచుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పవన్ కళ్యాణ్, దగ్గుపాటి రానా ల ఆఫ్ స్క్రీన్ ఫోటోను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది చిత్రయూనిట్. ఈ ఫోటోలో పవన్ కళ్యాణ్ ఒంటి నిండా గాయాలతో నులక మంచం మీద పడుకొని ఉండగా..రానా దగ్గుబాటి కూడా ఎడ్లబండి మీద పవన్ కళ్యాణ్ తో కలిసి చాలా సరదాగా సేదతీరుతున్నట్లుగా కనిపించడం..

 ఇప్పుడు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ ఇద్దరూ కెమెరా ముందు బద్ధ శత్రువులుగా, కెమెరా వెనక మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట్లో ఎంతో వైరల్ గా మారుతోంది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లు ఓ రేంజ్ లో ఉండబోతున్న ట్లు తెలుస్తోంది. అంతేకాదు సినిమాకి ఆ యాక్షన్ సీక్వెన్స్ లే మెయిన్ హైలెట్ గా నిలవనున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో పవన్ సరసన నిత్యమీనన్ హీరోయిన్గా నటిస్తుండగా.. దగ్గుబాటి రానాకు జోడిగా సంయుక్త మీనన్ కనిపించనుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: