సినిమా ఇండస్ట్రీ రాజకీయాలు పూర్తిగా భిన్నమైనవి. ఈ రెండు రంగాలకు అసలు సంబంధం కూడా ఉండదు.  కానీ ఎంతోమంది సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వచ్చి తమ సత్తా చాటిన వారు ఉన్నారు. అంతే కాదు చిన్నప్పటి నుంచి రాజకీయాలను అలవర్చుకుని రాజకీయ ఉద్దండులు గా మారిన వారిని సైతం ఓడించి తమ సత్తా చాటిన వారు ఉన్నారు. ఇలా సినిమా ఇండస్ట్రీలో ఒక గ్లామర్ డాల్ గా పేరు తెచ్చుకున్న ఒక మహిళ రాజకీయాల్లోకి వచ్చి ప్రజల మన్ననలు పొందడం అంటే అది మామూలు విషయం కాదు. అది కూడా మహిళల పట్ల వివక్ష కొనసాగుతున్న నాటి రోజులలో ఇది అసాధ్యం అని చెప్పాలి. ఇలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ తమిళులు అందరికీ అమ్మ గా మారిపోయింది జయలలిత. ఒకప్పుడు తమిళ చిత్ర పరిశ్రమలో అందానికి అభినయానికి కేరాఫ్ అడ్రస్ గా గ్లామర్ డాల్ గా ఉన్న జయలలిత ఇక ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి తిరుగులేని ప్రస్థానం కొనసాగించింది అని చెప్పాలి. వివాదాలు, అవినీతి ఆరోపణలు, అవమానాలు ఇలా ఎన్ని ఎదురైనా వెనకడుగు వేయకుండా నిలిచి గెలిచారు జయలలిత. నటుడు ఎంజీ రామచంద్రన్ 1977లో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సమయంలో ఆయనకు ఎంతో సన్నిహితురాలైన జయలలిత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1984లో రాజ్యసభకు ఎంపికయ్యారు జయలలిత. ఆ తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రి ఆరోగ్యం క్షీణించి మరణించగా ఇక ఆ తర్వాత జయలలిత ఏకంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయాక కొత్త పార్టీని స్థాపించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించి 1991లో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు జయలలిత. ఇక నాటి నుంచి 6 సార్లు ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి తమిళ ప్రజలందరికీ ఎంతో అద్భుతమైన పాలన అందించారు. పేద ప్రజల అభివృద్ధి కోసం ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టని పథకాలను ప్రవేశపెట్టి తమిళులు అందరికీ అమ్మ గా మారిపోయింది జయలలిత.  అంతే కాదు అందరి కడుపు నింపేందుకు అమ్మ క్యాంటీన్ లను కూడా ఏర్పాటు చేశారు ఇలా జయలలిత సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా రాణించి సాధికారత మహిళా చాటిచెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: