దక్షిణాది సూపర్ స్టార్ నయనతార విఘ్నేష్ శివన్ ల ప్రేమాయణం ఎట్టకేలకు పెళ్ళి దాక రాబోతోంది. అయితే ఆమె గత జీవితంలో జరిగిన లవ్ ఫెయిల్యూర్స్ కు సంబంధించిన జ్ఞాపకాలు ఇప్పటికీ ఆమెను వెంటాడుతూనే ఉన్నాయి. దీనితో విగ్నేష్ శివన్ తో అయినా తన జీవితం బాగుండాలని ఆమె కోరుకుని ప్రస్తుతం ఆమె ఒక ప్రత్యేక విమానం పెట్టుకుని దేశంలోని పుణ్యక్షేత్రాలు అన్నీ ఈ జంట ప్రస్తుతం చుట్టేస్తోంది.


ఈమధ్యనే వీరిద్దరూ కలిసి షిరిడీ హరిద్వార్ వెళ్ళి వచ్చారు. ఇప్పుడు వీరిద్దరూ పెళ్ళికి రెడీ అవుతున్న సమయంలో తమిళనాడుకు చెందిన ఒక ప్రముఖ జ్యోతిష్కుడు ఇచ్చిన సలహా నయన్ ఆలోచనలు మార్చినట్లు తెలుస్తోంది. నయనతారకు జన్మ రీత్యా కొన్ని గ్రహాలు అనుకూలంగా లేవని దీనితో ఆమెకు నటిగా పేరు వస్తుంది కాని వైవాహిక జీవితంలో భర్త ఎంత మంచి వాడు అయినప్పటికీ సమస్యలు వస్తాయని ఆ జ్యోతిష్కుడు నయన్ కు చెప్పి దానికి పరిష్కారం కూడ చెప్పినట్లు టాక్.


విగ్నేష్ శివన్ తో పెళ్ళికి ముందు నయన్ జాతక దోష పరిహారంగా ఆమెకు ఒక చెట్టుతో పెళ్ళి చేయిస్తానని ఇలాంటి పరిహారం గతంలో పురాణ కాలంలో ఉండేది అన్న ఉదాహరణలు వివరించినట్లు తెలుస్తోంది. గతంలో ఐశ్వర్యా రాయ్ అభిషేక్ బచన్ లకు పెళ్ళి జరిగే ముందు ఐశ్వర్య కు ఉన్న జాతక దోషాల రీత్యా తాను ఇదేవిధంగా ఆమెకు కూడ చెట్టుతో పెళ్ళి చేయించానని చెప్పినట్లు తెలుస్తోంది.


దీనితో నయనతార విగ్నేష్ శివన్ తో తన పెళ్ళి కలకాలం నిలవాలని కోరుకుంటూ చెట్టుతో తన పెళ్ళి చేసుకోవడానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు విగ్నేష్ శివన్ కుటుంబ సభ్యుల కోరికమేరకు ఆమె క్రైస్తవ మతం నుండి హిందూమతంలోకి మారి ప్రస్తుతం ఇలా గుడి గోపురాల చుట్టూ తిరుగుతోంది. గతంలో చాలామంది ప్రముఖ హీరోయిన్స్ తమ పెళ్ళికి ముందు రాహు కేతువుల పూజలు చేయించుకున్నారు. అయితే ఆపెళ్ళిళ్ళు నిలబడలేదు. మరి నయనతార జాతకం ఎలా మారనున్నదో చూడాలి..  



మరింత సమాచారం తెలుసుకోండి: