నేడు ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఎటు చూసినా డార్లింగ్ ఫ్యాన్స్ హుషారుగా హంగామా చేస్తున్నారు. సోషల్ రెబల్ స్టార్ అభిమానులు హ్యాష్ ట్యాగ్ లతో ప్రభాస్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సెలబ్రిటీలు కూడా ప్రభాస్ కు బర్త్డే విషెస్ ను తెలియచేస్తూ ఆయన ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నారు. ప్రభా సన్నిహితులు ఆయన ఫ్లాట్ కు గిఫ్ట్ లు కూడా పంపుతున్నట్లు సమాచారం. ఈ భల్లాల దేవుడు కూడా ఓ కానుక పంపినట్లు తెలుస్తోంది. అదేనండి రానా కూడా ప్రభాస్ కి ఒక స్పెషల్ గిఫ్ట్ పంపనున్నారు అని టాక్ వినిపిస్తోంది. మాములుగా సెలెబ్రిటీస్ పుట్టిన రోజుకు ఇలా బహుమతులు పంపించుకోవడం జరుగుతూ ఉంటుంది.

కానీ...ఒకవేళ పంపింది నిజమే అయితే రానాగిఫ్ట్ పంపుతారు అంటూ ఆసక్తి కనబరుస్తున్నారు ఫ్యాన్స్.  బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారారు ప్రభాస్. ఈ చిత్రంలో బాహుబలిగా ప్రభాస్ కి ఎంత గుర్తింపు అయితే లభించిందో బల్లాలదేవగా రానాకు కూడా అంతే గుర్తింపు లభించింది. వీరి కాంబోలో వచ్చిన ఈ చిత్రం సంచలన విజయాన్ని అందుకుంది. బాహుబలి సీక్వెల్ కూడా అంతకు మించిన రికార్డులు క్రియేట్ చేసి విజయాన్ని అందుకుంది. మాములుగానే రానా..ప్రభాస్ కి మంచి స్నేహితుడు ఈ సినిమా తర్వాత వీరి మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగింది.

స్నేహ బంధం తోనే ఇపుడు డార్లింగ్ బర్త్ డే కి ఏదో స్పెషల్ అండ్ కాస్ట్లి గిఫ్ట్ పంపనున్నాడు. అయితే అది ఏదో తెలియాలంటే ఇంకాస్త సమయం వేచి చూడాల్సిందే. కాగా త్వరలోనే వీరిద్దరి కాంబోలో మరో సినిమా రావాలని ఇద్దరి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వీరిద్దరూ ఒకే స్క్రీన్ పై తలపెడితే ఎలా ఉంటుందో ఇప్పటికే చూశాము. మరి ఇది త్వరలోనే నిజమవ్వాలని ఆశిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: