యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ అభిమానులు ఆయ‌న పుట్టిన రోజు వేడుక‌ల‌ను ఈరోజు ఘ‌నంగా జ‌రుపుకుంటున్నారు. అంద‌రూ ఎంతో ఆతృత‌తో ఎదురుచూస్తున్న  రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ "రాధేశ్యామ్" టీజ‌ర్‌ను ప్ర‌భాస్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఇవాళ‌ విడుద‌ల చేశారు మూవీమేక‌ర్‌. ప్ర‌భాస్‌, పూజాహెగ్దే జంట‌గా రూపొందించిన ఈ రొమాంటిక్ చిత్రం టీజ‌ర్ ఉత్కంఠ‌భ‌రితంగా ఉన్న‌ది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌, టీజ‌ర్‌లోని సీన్లు, ప్ర‌భాస్ చెబుతున్న ఒక్కోక్క డైలాగ్ ఎంతో విశేషంగా ఆక‌ట్టుకున్నాయి. టీజ‌ర్ విడుద‌లైన కొన్ని నిమిషాల్లోనే 100కే లైక్స్ సాధించడం విశేషం. ఈ టీజ‌ర్‌కు అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుంచి మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. కానీ "రాధేశ్యామ్" టీజర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ రికార్డును మాత్రం క్రాస్ చేయ‌లేక‌పోయింది.

జూనియ‌ర్ ఎన్టీఆర్ పాన్ఇండియా స్టార్‌గా ప్ర‌స్తుతం ఎంట్రీ ఇవ్వ‌డానికి సిద్ధంగా ఉన్నాడు. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఆర్ఆర్ఆర్ విడుద‌ల అయితే ఆయ‌న‌కు దేశ‌వ్యాప్తంగా అభిమానులు ఉండే అవ‌కాశం లేక‌పోలేదు. ఇప్ప‌టికే ప్ర‌భాస్ మాత్రం మూడు పాన్ ఇండియా సినిమాలు చేశాడు. ఆయ‌న‌కు దేశ‌వ్యాప్తంగా కాదు.. బాహుబ‌లితో ప్ర‌పంచ‌వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. దీనికి తోడు రాధేశ్యామ్  టీజ‌ర్ మోస్ట్ అవైటేడ్ అని చెప్ప‌వ‌చ్చు. ఎప్ప‌టి నుంచో ఈ ఈటీజ‌ర్ కోసం ప్ర‌భాస్ అభిమానులు ఎప్పుడు ఎప్పుడు అని క‌ళ్లు కాయ‌లు కాసేలా ఎదురు చూస్తున్నారు. వారు ఎంత‌గానో ఎదురు చూసిన త‌రువాత విడుద‌లైన రాధేశ్యామ్ టీజ‌ర్ ఎన్టీఆర్ రికార్డును మాత్రం బ్రేకు చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

"రాధేశ్యామ్" టీజ‌ర్ టాలీవుడ్ ఫాస్టెస్ట్ 100కే లైక్డ్ కావ‌డానికి 22 నిమిషాల స‌మ‌యం తీసుకున్న‌ది. కానీ రామ‌రాజుఫ‌ర్‌భీం అంటూ ఆర్ఆర్ఆర్ టీమ్ ఎన్టీఆర్‌ను ప‌రిచ‌యం చేసిన కొమురం భీమ్ ఇంట్రో టీజ‌ర్ కేవ‌లం 7 నిమిషాల వ్య‌వ‌ధిలోనే ఈ ఫీట్ సాధించ‌డం గ‌మ‌నార్హం. త‌రువాత స్థానాల్లో వ‌రుసగా వ‌కీల్‌సాబ్ 8 నిమిషాలు, స‌రిలేరు నీకెవ్వ‌రు 18 నిమిషాలు, భీంఫ‌ర్ రామ‌రాజు టీజ‌ర్లు 20 నిమిషాలతో టాలివుడ్ ఫాస్టెస్ట్ 100కే లైక్స్ సాదించాయి. వీట‌న్నింటిని రాధేశ్యామ్ దాట‌లేక‌పోయింది. కానీ  ప్ర‌స్తుతం ఈ జాబితాలో ఐదో స్థానంలో నిలిచింది. "రాధేశ్యామ్" త‌రువాత సాహో, ఆచార్య‌, పుష్ప చిత్రాలు నిలిచాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: