టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే రెబల్ స్టార్ ప్రభాస్ అనే చెబుతారు. అభిమానుల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలొయింగ్ ఉన్న.. ప్రభాస్ పెళ్లి విషయంలో ఎందుకో వెనకబడ్డారు. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి సినిమా వరల్డ్ బిగ్గేస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాతో ప్రభాస్ ప్రపంచస్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ సినిమాతో ప్రభాస్‌కు అభిమానుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. దీంతో అప్పటినుంచి తన క్రేజ్‌ను తగ్గించుకోకుండా మంచి స్టోరీలున్న కథలు సెలెక్ట్ చూసుకుంటున్నారు. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. అయితే గతంలో బహుబలి సినిమా తర్వాత పెళ్లి చేసుకుంటారని చాలా మంది భావించారు. అప్పట్లో సోషల్ మీడియాలో సైతం పెళ్లి విషయంపై బాగానే రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి.

కానీ బహుబలి సినిమా కమిట్‌మెంట్ వల్ల పెళ్లి విషయంలో క్లారిటీ రాలేదు. అయితే ప్రభాస్ సినిమా విషయంలో ఎంతో సంబరంగా ఉండే అభిమానులు.. పెళ్లి విషయం అనే సరికి ఆందోళన చెందుతున్నారు. అయితే దీనికి ఒక కారణం ఉంది. తాజా సమాచారం ప్రకారం... ప్రభాస్ జాతకంలో పెళ్లి అనే తతంగం లేదని పలువురు జ్యోతిష్యులు చెబుతున్నారు. ప్రభాస్ జాతకంలో పెళ్లి గడియలు ఇంకా రాలేదని చెబుతున్నారు. అందుకే ఇప్పటివరకు పెళ్లి గురించి ఆలోచించడం లేదని జ్యోతిష్యులు పేర్కొంటున్నారు.

ప్రభాస్ జాతకం ప్రకారం పెళ్లి ఇప్పట్లో లేదని ప్రస్థావించారు. అయితే ఒక వేళ పెళ్లి చేసుకున్న ప్రభాస్‌కు పిల్లలు పుట్టే అవకాశం లేదని అంటున్నారు. దీంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటివరకు పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడనే ఆందోళనలో ఉన్న అభిమానులకు ఈ విషయం పెద్ద షాక్‌ను ఇచ్చింది. వాస్తవానికి సమంత విషయంలోనూ జ్యోతిష్యులు చెప్పిన మాటలు నిజం కావడంతో ప్రభాస్ అభిమానులు కూడా ఆందోళన మొదలైందని చెప్పవచ్చు. ఇలాంటి వార్తలకు చెక్ పెట్టాలంటే ప్రభాస్‌కు పెళ్లి జరగాలని.. అప్పుడే వాస్తవాలు తెలుస్తాయని అభిమానులు ఎంతో ఆతురతగా వేచిచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: