ఒక సినిమా వెనుక ఎంతో మంది కృషి ఉంటుంది. అయితే అందరి కన్నా ముందు వినిపించే పేరు దర్శకుడు మరియు హీరో. వీరిద్దరిని బట్టే సాధారణంగా ఆ సినిమా అంచనాలు పెరుగుతుంటాయి. ఒక సినిమాని హిట్ చేయడం వెనుక దర్శకుడు ప్రతిభ ఎంతో ఉంటుంది. ఇక టాలెంట్ ఉంది అంటే అటువంటి వారికి అవకాశాలకు కొదవ ఉండదు. స్టార్ హీరోలు సైతం అటువంటి డైరెక్టర్ లతో వర్క్ చేయడానికి క్యూలు కడుతుంటారు. అంతటి ప్రతిభను కనబరచి ఇండస్ట్రీలో తనకంటూ మార్క్ ను క్రియేట్ చేసుకున్న టాలీవుడ్ దర్శకుల్లో సుజిత్ కూడా ఒకరు. తెలుగు తమిళ హిందీ భాషలలో పలు షార్ట్ ఫిల్మ్స్ తీసి గుర్తింపు తెచ్చుకున్న ఈ దర్శకుడు సినీ ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టాడు.

"రన్ రాజా రన్" సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి డైరెక్టర్ గా పరిచయమయిన ఈ యంగ్ దర్శకుడు ప్రతిభ ఎక్కడున్నా అవకాశాలు వారిని వెతుక్కుంటూ వస్తాయని నిరూపించాడు. తొలి సినిమాతోనే ఘనవిజయాన్ని తన ఆకౌంట్ లో వేసుకుని భళా అనిపించాడు. ఆ తరువాత ఏకంగా పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో "సాహో" సినిమాని పట్టాలెక్కించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అసలు ఈ అవకాశం ఎలా వచ్చింది? ప్రభాస్ ఈ యంగ్ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఎపుడు ఇచ్చారు? అంటే, యువి క్రియేషన్స్ వారు కొత్త దర్శకుల కోసం చూస్తున్న సమయంలో, విషయం తెలుసుకున్న సుజిత్ అక్కడికి వెళ్లారు. అక్కడే హీరో ప్రభాస్ తో దర్శకుడు సుజిత్ కి పరిచయం ఏర్పడింది.

తన మొదటి సినిమా హిట్ అవ్వడంతో ప్రభాస్ వద్దకు వెళ్ళి కథ వినిపించగా అది డార్లింగ్ కి నచ్చి కథకి ఒకే చెప్పారు. బాహుబలి సినిమా తరవాత చెప్పిన ప్రకారం సుజిత్ తో సినిమాకి డేట్స్ ఇచ్చారు. సుజిత్ కూడా అంత పెద్ద హీరో అవకాశం ఇవ్వడంతో ఎంతో ఆలోచించి తన ప్రతిభకు పదును పెట్టి "సాహో" లాంటి యాక్షన్ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయినా దర్శకుడి ప్రతిభకు, హీరో ప్రభాస్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతానికి మంచి కథ రెడీ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి త్వరలోనే మరో అద్భుతమైన మూవీతో మన ముందుకు రావాలని ఆశిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: