ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మానియా కొనసాగుతోంది. ఇటీవల ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన 'రాధేశ్యామ్' టీజర్ రికార్డ్ ల మీద రికార్డ్ లు క్రియేట్ చేస్తోంది. ఇక రాధేశ్యామ్ సినిమాతో పాటు సలార్, ఆది పురుష్ సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు ప్రభాస్. ఇక రాధేశ్యామ్ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుండగా.. ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తున్న ఆది పురుష్ మాత్రం వచ్చే ఏడాది ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇక తాజా సమాచారం మేరకు వచ్చే నెలలో ఆదిపురుష్ షూటింగ్ పూర్తి కాబోతున్నట్లు తెలుస్తోంది. 

ఇప్పటికే రావణుడిగా సైఫ్ అలీ ఖాన్.. సీతాదేవి గా నటిస్తున్న కృతి సనన్ పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తయింది. మరో పది రోజుల్లో లో ప్రభాస్ పాత్రకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి కానుందట. ఇక ప్రభాస్ రోల్ షూటింగ్ పూర్తి కాగానే విఎఫ్ఎక్స్ పనులను మొదలు పెట్టబోతున్నాడట దర్శకుడు. ఇక ఈ చిత్రంలో బాహుబలి కంటే మూడు రెట్లు ఎక్కువగా వి ఎఫ్ ఎక్స్ వర్క్ ఉండబోతున్న ట్లు తెలుస్తోంది. దాదాపు ఆరు నెలలకు పైగా ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ కోసం సమయం కేటాయించానున్నాడట దర్శకుడు ఓం రావుత్. అంతే కాదు త్రీ డి లో కూడా ఆదిపురుష్ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.

 ఇక ఇన్సైడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే ఈ సినిమా అవుట్ పుట్ చాలా అద్భుతంగా వస్తోందట.సినిమాలో శ్రీరాముడు గెటప్ లో ప్రభాస్ లుక్ అందరినీ అబ్బుర పరిచే విధంగా ఉంటుందని అంటున్నారు. రామాయణ పౌరాణిక బాధ నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు ఓం రావత్. ఇక ప్రభాస్ సైతం ఇలాంటి జోనర్ లో మొదటి సారి నటిస్తుండటంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమా భారీ బడ్జెట్ తో అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాతో ప్రభాస్ కి బాలీవుడ్ లో మార్కెట్ పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: