హీరోయిన్స్ ఎంపిక విషయంలో పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వని పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో నటించబోయే ‘భవధీయుడు భగత్ సింగ్’ మూవీలో పూజా హెగ్డే ను హీరోయిన్ గా ఎంపిక చేయమని ఆశక్తి కనపరిచాడు అని వస్తున్న వార్తలను బట్టి ఆమె మ్యానియా ఏ రేంజ్ లో ఉందో అర్థం అవుతుంది. ఈ పరిస్థితులు ఇలా కొనసాగుతూ ఉంటే ఈమె ముంబాయ్ లో కట్టుకుంటున్న ఆమె సొంత ఇల్లు సంబంధించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
ముంబాయిలో ప్రముఖ సినిమా సెలెబ్రెటీలు నివాసం ఉండే జూహు ఏరియాలో ఆమె ఒక విలాసవంతమైన భవనాన్ని కడుతోంది. క్షణం తీరికలేని షూటింగ్ లతో కాలం గడుపుతున్నప్పటికీ తరుచూ ఆమె తన ఇంటి నిర్మాణం జరుగుతున్న స్పాట్ లోకి వెళ్ళి తన ఇంటి నిర్మాణ పనులను పర్యవేక్షిస్తోందట.
అంతేకాదు ఆ ఇంటిలోని ప్రతి రూమ్ లోను తాను వేసే పెయింటింగ్స్ ఉండాలి అన్న ఉద్దేశ్యంతో ఆమె ఇన్ని షూటింగ్ ల హడావిడి మధ్య కూడ ఖాళీ చేసుకుని పెయింట్స్ వేస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం ఆ ఫోటో ఆమె అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారింది. సుమారు 20 కోట్లు విలువ చేసే ఆ విలాసవంతమైన భవనంలో ఇంటీరియర్ కూడ చాల ఖరీదైనది అని అంటున్నారు. సినిమాకు 3 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్న ఈమె ఈపాటి స్థాయి ఇల్లు కట్టుకోవడం ఆశ్చర్యం కల్గించే విషయం కాకపోయినా ఇంత బిజీలో కూడ ఆమె తన ఇంటి కోసం పెయింట్ లు వేయడం మాత్రం ఆశ్చర్యాన్ని
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి