అయితే గత సీజన్లో లాగా ఈ సీజన్లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఏమి లేకపోవడం గమనార్హం. ఇకపోతే ఇప్పటికే ఎనిమిది వారాల లో ఏకంగా 8 కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. ఈ ఆదివారం ఎన్నో రోజుల నుంచి బిగ్ బాస్ హౌస్ లో సూపర్ ఎంటర్టైనర్ గా కొనసాగుతున్న లోబో ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వచ్చాడు. ఇక లోబో బయటికి వస్తున్న సమయంలో హౌస్ లోని కంటెస్టెంట్స్ కాస్త ఎమోషనల్ అయ్యారు అని చెప్పాలి. ఇకపోతే బిగ్ బాస్ హౌస్ నుండి లోబో బయటికి వచ్చిన తర్వాత లోబో పారితోషికం ఎంత అన్న విషయంపై ప్రస్తుతం ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి.
బిగ్ బాస్ హౌస్ లో అందరి తో పోల్చి చూస్తే ఎంతో డిఫరెంటు లుక్ తో కనిపిస్తూ అందరినీ తన కామెడీతో ఎంటర్ టైన్ చేసిన లోబో అటు పారితోషికం కూడా భారీగానే తీసుకున్నాడు అని తెలుస్తోంది. బిగ్బాస్ లో లోబోకి ప్రతిరోజు 25 వేల వరకు పారితోషికం ఇచ్చారట. ఇలా మొత్తంగా ఎనిమిది వారాల పాటు హౌస్ లో ఉన్నందుకు గాను 15 లక్షలకు పైగానే లోబో పారితోషికం తీసుకున్నాడు అన్న విషయం తెలుస్తుంది. ఇకపోతే ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన లోబో ఇక బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా వెళ్లడంతో అందరి మనసులకు మరింత దగ్గరయ్యాడు అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి