ఈనేపధ్యంలో ఈమూవీ ట్రయలర్ లాంచ్ ఫంక్షన్ లో ముఖ్య అతిధిగా వచ్చిన అల్లు అర్జున్ కామెంట్స్ ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి. స్వయం కృషితో ఎదిగిన వ్యక్తులు అంటే తనకు ఎంతో ఇష్టం అని బన్నీ చెపుతూ ఎటువంటి గాడ్ ఫాదర్ లేకుండా ఎదిగిన విజయ్ దేవరకొండ అంటే తనకు ఎంతో అభిమానం అంటూ కామెంట్స్ చేశాడు.
ఇదే సందర్భంలో విజయ్ దేవరకొండ మ్యానియా గురించి మాట్లాడుతూ రోజురోజుకు పెరిగిపోతున్న విజయ్ క్రేజ్ ను చూసి తనకు ఈర్ష్య కలగడం లేదా అని చాలామంది అడుగుతూ ఉంటారని అయితే ఎదుటి వారిని చూసి ఈర్ష్య పడేవారు ఇక జీవితంలో ఎదగలేరు అని తన అభిప్రాయం అంటూ జోక్ చేశాడు. అంతేకాదు తన సినిమా కథల ఎంపిక విషయంలో చాల డిఫరెంట్ గా ఉంటూ టాప్ హీరోలను కూడ ఆశ్చర్య పరుస్తున్నాడు అంటూ ప్రశంసలు కురిపించాడు.
ఇక ఆనంద్ దేవరకొండ గురించి మాట్లాడుతూ చాలామంది కమర్షియల్ హీరోలు చేయలేని డిఫరెంట్ కథలను ఆనంద్ ఎంచుకుంటున్నాడని అంటూ ఎప్పటికైనా విజయ్ కి తన ఇంటిలో తన తమ్ముడు నుండే పోటీ ఏర్పడుతుంది అంటూ జోక్ చేసాడు. ఈమధ్య వరసపెట్టి అల్లు అర్జున్ సినిమా ఫంక్షన్స్ కు వెళుతూ అందరి పై ప్రశంసలు కురిపిస్తూ తాను అందరి వాడిని అన్న సంకేతాలు ఇస్తున్నాడు. దీపావళి సినిమాల హడావిడి తరువాత విడుదల కాబోతున్న ‘పుష్పక’ విమానం’ ఏ మేరకు ఆనంద్ కు హిట్ ఇస్తుందో చూడాలి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి