ఈ టాక్ షో తొలి ఎపిసోడ్ లో మంచు మోహన్ బాబుతో పాటు ఆయన కుమారుడు, తాజా గా మా ఎన్నికల్లో అధ్యక్షుడిగా గెలిచిన మంచు విష్ణు , మంచు మోహన్ బాబు ముద్దుల కుమార్తె మంచు లక్ష్మీ ప్రసన్న కూడా పాల్గొన్నారు. బాలయ్య పదునైన ప్రశ్నలతో మోహన్ బాబును ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే మోహన్ బాబు ను బాలయ్య పలు కొంటె ప్రశ్నల తో కెలికేందుకు ప్రయత్నించారు.
చిరంజీవి తో నీకు సంబంధాలు ఎలా ఉన్నాయన్న ప్రశ్న వేశాడు. ఈ క్రమంలోనే మోహన్ బాబు స్పందిస్తూ తాను అల్లు రామ లింగయ్య గారితో కలిసి చాలా సినిమాలు చేసాను అని... చిరు పెళ్లాడింది ఆయన కూతురునే కదా ... అంటే మా ఇంటి ఆడపిల్లే కదా అన్నాడు మోహన్ బాబు. ఈ ప్రశ్నకు మోహన్ బాబు చాలా లౌక్యంగా సమాధానం చెప్పాడనే అనుకోవాలి.
మా ఇంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకే చిరంజీవి బాగున్నాడు అని మోహన్ బాబు అన్నాడు . అయితే ఇందులో మరో కోణం ఉందా ? అన్న డౌట్ కూడా కలుగుతోంది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోకపోతే చిరంజీవి కి లైఫ్ లేదా అని మోహన్ బాబు అన్నాడా ? అని అంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి