బుల్లితెర ప్రేక్షకులందరికీ చూపును ఆకర్షిస్తూ ప్రస్తుతం బుల్లితెర పై సరికొత్త చరిత్ర సృష్టిస్తూ టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ దూసుకు పోతోంది బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. గత సీజన్ల తో పోల్చి చూస్తే ఇక ఈ సీజన్ మరింత క్రేజ్ సంపాదించుకుని దూసుకు పోతుంది అని చెప్పాలి. ఇక ఈ సీజన్ లో ఎక్కువ మంది తెలుగు ప్రేక్షకులకు తెలిసిన సెలబ్రిటీలే కంటెస్టెంట్ గా రావడంతో ఇక ప్రస్తుతం ప్రతి రోజు బిగ్ బాస్ షో మిస్ అవ్వకుండా చూడటానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.. బిగ్ బాస్ షోలో భాగంగా ప్రతివారం నామినేషన్స్ టాస్క్ ఎంతో ఆసక్తికరంగా సాగిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల హీరోలు విలన్లు అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్.


 ఈ క్రమంలోనే ఈ టాస్క్ లో భాగంగా కంటెస్టెంట్స్ చేసిన రచ్చ మాములుగా లేదు అని చెప్పాలి. ఈ టాస్క్ లో భాగంగా శ్రీరామచంద్ర, యాంకర్ రవి లను  ఎంతో ఇబ్బందులకు గురిచేశారు ప్రత్యర్థి జట్టు కంటెస్టెంట్. ఇక ఇలా ఇబ్బందులకు గురిచేయడం అటు ప్రేక్షకుల కు కూడా నచ్చలేదు అని చెప్పాలి. అయితే శనివారం రోజున నాగార్జున వచ్చి సందడి చేశారు ఇక ఇటీవలే బిగ్ బాస్ కి సంబంధించిన ప్రోమో విడుదలై సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ ప్రోమో లో భాగంగా నాగార్జున యాంకర్ రవి శ్రీరామచంద్రుల కు రివేంజ్ తీర్చుకోవడానికి అవకాశం ఇచ్చాడు.



ఈ క్రమంలోనే యాంకర్ రవి ఏకంగా షణ్ముఖుని పిలిచి ఒక వింత జ్యూస్ కలిపి ఇస్తాడు . అయితే ఆ వింత జ్యూస్ తాగి ఏకంగా షణ్ముఖ చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక ఆ తర్వాత శ్రీ రామచంద్ర ఏకంగా సన్నీ ని పిలిచి చిత్రవిచిత్రమైన కాంబినేషన్లో ఒక జ్యూస్ కనిపిస్తాడు. ఇక ఆ జ్యూస్ తాగడానికి సన్నీ ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఈ క్రమంలోనే కొన్ని పంచ్ డైలాగులు కూడా చెబుతాడు సన్నీ. నువ్వు పూర్వ జన్మలో నా మొగుడివి అయి ఉంటావు.. అందుకే ఈ జన్మలో ఈ రేంజ్లో రివెంజ్ తీర్చుకుంటున్నావ్ అంటూ సన్నీ పంచ్ వేయడంతో అక్కడున్న వారందరూ నవ్వుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: