మొన్నా మధ్య జరిగిన సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ వేడుకలో పాల్గొన్న రాజమౌళి , అనుష్క గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.. ఇప్పటి వరకు ఆమె గురించి ఎంతో మంది సెలబ్రిటీలు చాలా గొప్పగా చెప్పారు.. కానీ ఇప్పుడు నేను ఆమె గురించి ఎవరికీ తెలియని కొన్ని విషయాలు చెప్పడానికి బాగా వెతుక్కొని వచ్చాను అంటూ ఆయన తెలిపాడు. అంతే కాదు అనుష్క నాతో పాటు నా కుటుంబానికి కూడా చాలా క్లోజ్ అని రాజమౌళి వివరించారు. సాధారణంగా రాజమౌళి సినిమాలో హీరోయిన్ కి పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదు.. కానీ బాహుబలి సినిమాలో దేవసేన పాత్రను అనుష్క కి ఇచ్చాను.. ఆమె నా మాట నిలబెట్టడం తో పాటు ఆ పాత్రకు పూర్తిగా న్యాయం చేసింది హాట్సాఫ్ అనుష్క అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు.
ఇక అనుష్క తో వచ్చిన చిక్కంతా ఒకటేనని తెలిపాడు.. అదేమిటంటే రవితేజతో విక్రమార్కుడు సినిమా తీసినప్పుడు ప్రతి సీను కూడా ముందే చూపించమని అడిగేది. అంతేకాదు రొమాన్స్ సీన్ కూడా రవితేజ తో నేను చేసిన తర్వాతనే తను తన బాడీ లాంగ్వేజ్ సెట్ చేసుకొని, ఆ తర్వాత చేసేది అని , విక్రమార్కుడు సినిమా సమయంలో అనుష్క తో బాగా ఇబ్బంది పడ్డాను అంటూ నవ్వుతూ తెలిపాడు రాజమౌళి. అంతే కాదు గుడ్ అబ్జర్వర్ అని కూడా తెలిపాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి