ఈ క్రమంలోనే తెలుగు ప్రేక్షకులందరికీ కొత్తదనాన్ని పరిచయం చేస్తూ సరికొత్త లవ్ స్టొరీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుని ఒక్కసారిగా స్టార్ హీరోగా మారిపోయాడు అల్లు అర్జున్. ఇలా అల్లు అర్జున్ కెరీర్ కి బ్రేక్ ఇచ్చిన సినిమా ఆర్య. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. అయితే ఇక ఈ సినిమాను అటు దిల్రాజు నిర్మించారు అన్న విషయం తెలిసిందే. సాధారణంగా అందరూ ఐలవ్యూ చెబుతూ ప్రేమ సాగిస్తూ ఉంటారు. కానీఆర్య సినిమా లో మాత్రం ఐ హేట్ యూ తో లవ్ స్టోరీ సాగిపోతూ ఉంటుంది. కొత్తదనం ప్రేక్షకులకు తెగ నచ్చేసింది.
అయితే ముందుగా ఈ సినిమాలో అల్లు అర్జున్ తో తీయాలని అనుకోలేదట దర్శకుడు సుకుమార్. అప్పటికే వి.వి.వినాయక్ దగ్గర అసిస్టెంట్గా దిల్ మూవీ కి పని చేస్తున్నాడు సుకుమార్. ఆ సమయంలో నిర్మాత దిల్ రాజుతో పరిచయం ఏర్పడగా.. ఒక అవకాశం ఇస్తానని చెప్పాడట. ఈ క్రమంలోనే ఇక ఆర్య సినిమా స్టోరీవినిపించడం తో దిల్ రాజు నచ్చిందట. నితిన్ లేదా రవితేజతో చేయాలని భావించినప్పటికీ వారికి డేట్స్ కుదరలేదట. ప్రభాస్ కు దిల్ సినిమా చూపించెందుకు ఒక స్పెషల్ షో వేసిన సమయంలో ప్రభాస్ తో పాటు అల్లు అర్జున్ వెళ్లగా.. అల్లు అర్జున్ ను చూసి అల్లు అర్జున్ తోనే సినిమా చేయాలని సుకుమార్ ఫిక్స్ అయ్యాడట. ఇక కథ వినిపించగానే అల్లు అర్జున్ కూడా చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇలా వచ్చిన ఆర్య సినిమా అల్లు అర్జున్ కి ఒక బిగ్ హిట్ ఇచ్చింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి