ప్రస్తుతం బుల్లితెరపై అసలు సిసలైన డాన్స్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది ఈటీవీ లో ప్రసారమయ్యే డాన్స్ రియాలిటీ షో ఢీ. ఎన్నో సీజన్ల నుంచి  ఎంతో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది ఈ కార్యక్రమం. అటు చిత్ర పరిశ్రమకు  మంచి కొరియోగ్రాఫర్ లను కూడా ఇస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో టాప్ కొరియోగ్రాఫర్ లుగా కొనసాగుతున్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ లు ఒకప్పుడు ఢీ షో లో కంటెస్టెంట్ గా చేసిన వారే. ఢీ షో లో సత్తా చాటుకున్న తర్వాత టాలీవుడ్ లో మాస్టర్ గా మారి సత్తా చాటారు. ఇలా ప్రస్తుతం బుల్లితెరపై డాన్స్ కి కేరాఫ్  అడ్రస్ గా మారిపోయింది ఈ షో.


అయితే ఈ షో కి పోటీగా వివిధ చానళ్లలో ఎన్నో కార్యక్రమాలు వచ్చినప్పటికీ ఈ షోని బీట్ చేయలేక పోయాయి అని చెప్పాలి. ఒకప్పుడు కేవలం డాన్స్ మాత్రమే ఉండేది. ఇప్పుడు అంతకుమించి అనే రేంజ్ లోనే ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. దీంతో బుల్లితెర ప్రేక్షకులు ఈ షో చూడడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇటీవలే క్వార్టర్ ఫైనల్స్ పూర్తిచేసుకున్న ఢీ షో సెమీ ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఇక ఈ సెమీఫైనల్లో ఢీ కంటెస్టెంట్స్ డాన్స్ పర్ఫార్మెన్స్ ను చూసేందుకు మంచు వారి అమ్మాయి లక్ష్మి స్పెషల్ గెస్ట్ గా వచ్చేసింది.



 మంచు లక్ష్మితో పాటు గుంటూరు టాకీస్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో సిద్దు కూడా స్పెషల్ గెస్ట్ గా వచ్చేస్తాడు. దీంతో షో మొత్తం సందడి సందడిగా సాగింది. ఇక రావడం రావడమే సిద్దు ఒక మంచి సింగర్ తబలా ప్లేయర్ అంటూ చెబుతుంది మంచు లక్ష్మి. ఇక వెంటనే అందుకున్న హైపర్ ఆది వాహ్ తాజ్ లో ఉంది మీరేనా భయ్యా అంటూ జోక్ వేయడంతో అక్కడున్న వారందరూ నవ్వుకుంటారు. ఇక ఆ తర్వాత ఢీ లోని కంటెస్టెంట్స్ పర్ఫామెన్స్ చూసి సంభ్రమాశ్చర్యాలకు గురి అవుతుంది మంచు లక్ష్మి.

మరింత సమాచారం తెలుసుకోండి: