టాలీవుడ్ కమర్షియల్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఆచార్య'. కొణిదెల ప్రొడక్షన్స్ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న విడుదల కానుంది. ఈ సినిమాలో చిరంజీవి రెండు డిఫరెంట్ షేడ్స్ కలిగిన పాత్రలో కనిపించనున్నారు. ఇక చిరుతో పాటు ఆయన కొడుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం మరో కీలక పాత్రలో నటించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.

 దీంతో ఈ సినిమాపై మెగా ఫాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో సైతం భారీ అంచనాలు నెలకొన్నాయి. చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరు కలిసి నటిస్తే చూడాలని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మెగా ఫాన్స్ కల ఈ సినిమాతో తీరబోతోంది. దాంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఆచార్య సినిమాలో రామ్ చరణ్ సిద్ధ అనే పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈరోజు ఆచార్య సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ ని ఇవ్వబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దాంతో అభిమానులు ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ వస్తుందా అని ఎంతో ఆసక్తితో ఎదురు చూశారు.

 అయితే అనుకున్న సమయానికి ఆచార్య టీమ్ అప్ డేట్ ఇవ్వలేదు. దాంతో అభిమానులు కాస్త నిరాశకు లోనయ్యారు. ఈ మేరకు ఆచార్య సినిమా నిర్మిస్తున్న  కొణిదెల ప్రొడక్షన్స్ ట్వీట్ చేయడం జరిగింది.' కొద్దిపాటి ఆలస్యమైంది. కానీ ఇచ్చే అప్డేట్ మాత్రం అదిరిపోతుంది' అంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు. దాంతో అభిమానులు వారి ఎదురుచూపులు ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. మరి ఆచార్య నుండి వచ్చే ఆ అదిరిపోయే అప్డేట్ ఏంటనేది చూడాలి. ఇక మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి కి జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా, రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే కనిపించనుంది. ఇక తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన 'నీలాంబరి' అనే పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే...!!

మరింత సమాచారం తెలుసుకోండి: