సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఉండే నటీనటుల పేర్లు వెనుక కొన్ని రహస్యాలు దాగి ఉన్నాయని చెప్పాలి..ఎందుకంటే అల్లు రామలింగయ్య పేరును వారి ఊరిలో ఉన్న రామలింగేశ్వరస్వామి పేరు మీదుగా పెడితే... చిరంజీవి పేరు ని తన తల్లి హనుమంతుడి భక్తురాలు కాబట్టి శివశంకర్ అనే పేరును మార్చి చిరంజీవి గా మార్చుతుంది.. ప్రస్తుతం ఉన్న నటీనటుల తల్లిదండ్రుల సెంటిమెంట్ మేరకు కూడా పేర్లు మార్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. దర్శకనిర్మాతలు కూడా మరికొంత మంది హీరోయిన్ల పేర్ల ను మార్చిన విషయం మనకు తెలిసిందే. అలాగే ప్రముఖ సంగీత దర్శకుడిగా గుర్తింపు పొందిన ఎం.ఎం.కీరవాణి పేరు వెనుక కూడా చాలా పెద్ద కథే ఉందట.. ఎం.ఎం.కీరవాణి కి వీరి తండ్రి శివ శక్తి దత్త ఆ పేరు పెట్టడం వెనుక గల రహస్యం ఏమిటో ఇప్పుడు ఒకసారి చదువు తెలుసుకుందాం..


అప్పట్లో ప్రముఖ స్టార్ హీరోగా గుర్తింపు పొందిన అక్కినేని నాగేశ్వరరావు.. హీరోయిన్ భానుమతి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం విప్రనారాయణ. ఈ చిత్రం విడుదల అయినప్పుడు .. చిత్రంలోని పాటలన్నీ మంచి హిట్ అవ్వడమే కాకుండా ఆ పాటలకు సంగీతం అందించిన సంగీత దర్శకుడు ఎస్.రాజేశ్వరరావు కు మంచి గుర్తింపు లభించింది. ఇక ఆ పాటలకు ఆకర్షితులైన వారిలో కీరవాణి నాన్న శివశక్తి దత్తా కూడా ఒకరు. ఆయనకు విప్రనారాయణ సినిమా లో ఉన్న అన్ని పాటలలో " ఎందుకోయి తోటమాలి " అనే పాట విపరీతంగా నచ్చిందట.

ఆ పాటలో దాగి ఉన్న ఆంతర్యం ఏమిటో తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఎస్.రాజేశ్వరరావు ను కలిశారు. తమ అభినందనలను తెలియజేసి ఆ పాట గురించి అడిగారు. అప్పుడు ఎస్.రాజేశ్వరరావు కీరవాణి రాగంలో ఆ పాటలకు బాణీలు సమకూర్చినట్లు తెలిపాడు. దాంతో ఆ సంగీతాభిమాని తనకు అబ్బాయి పుట్టినా.. అమ్మాయి పుట్టిన కీరవాణి అనే పేరు పెట్టాలని నిశ్చయించుకున్నాడు. అలా కొడుకు పుట్టగానే కీరవాణి అని పేరు పెట్టాడు. ఇక ప్రస్తుతం ఆ అబ్బాయి పెరిగి పెద్దయి సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఎం.ఎం. కీరవాణి అంటే మరకతమని కీరవాణి అని అర్థం

మరింత సమాచారం తెలుసుకోండి: