ఇక ఈ సినిమా డిసెంబర్ 2న విడుదల కానుండగా తమ హీరో తప్పకుండా దీనితో సూపర్ హిట్ కొట్టడం ఖాయం అని బాలయ్య ఫ్యాన్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం పలు టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం అఖండ లో అద్భుతమైన యాక్షన్, మాస్ సన్నివేశాలు ఉన్నాయని, అలానే కథతో పాటే అంతర్లీనంగా సాగె ఎమోషన్స్ అందరి మదిని తాకుతాయని సమాచారం. ముఖ్యంగా గతంలో బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు ఎంత పెద్ద సక్సెస్ అయ్యాయో మనకు అందరికీ తెలిసిందే.
అయితే వాటిని మించేంతగా ఈ సినిమాలోని సీన్స్ ని మరింత అద్భుతంగా రాసుకున్నారట దర్శకుడు బోయపాటి శ్రీను. మరోవైపు ఇటీవల అఖండ చూసిన సెన్సార్ సభ్యులు సినిమాపై మంచి రెస్పాన్స్ అందించడంతో అఖండ పై మరింత అంచనాలు పెరిగాయి. మొత్తంగా మంచి అంచనాలతో మరొక వారంలో థియేటర్స్ లో రిలీజ్ కానున్న అఖండ మూవీ సూపర్ హిట్ కొట్టే అవకాశం గట్టిగా కనపడుతోందని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.