సాధారణంగా ఎవరైనా డాన్స్ చేస్తూ ఉంటే చూడటానికి అందరూ ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. అలాంటిది అదిరిపోయే డాన్స్ పెర్ఫార్మెన్స్  చూడటానికి ఎవరూ ఇష్టపడరు. ఇలా ప్రేక్షకులందరికీ అదిరిపోయే డాన్సులతో ఆశ్చర్యపరుస్తూ  టాప్ రేటింగ్  సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది ఈటీవీ లో ప్రసారమయ్యే డాన్స్ రియాలిటీ షో ఢీ . కేవలం ఒక్క సీజన్లో మాత్రం కాదు అన్ని సీజన్లలో కూడా ప్రస్తుతం బుల్లితెరపై టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటున్న డాన్స్ షోగా కొనసాగుతోంది. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి రాణించాలి అనుకున్న ఎంతోమంది యువకులకు  డాన్స్ రియాలిటీ షో నుండి ఒక మంచి వేదికగా మారిపోయింది. ఢీ షో లో కంటెస్టెంట్ గా కొరియోగ్రాఫర్ గా ఎంట్రీ ఇచ్చిన వారు ఇక ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ కొరియోగ్రాఫర్ లుగా కొనసాగుతున్నారు.


 అయితే ఒకప్పుడు ఢీ కార్యక్రమంలో కేవలం డాన్స్ మాత్రమే కనిపించేది. కానీ ఇప్పుడు మాత్రం డాన్స్ తో పాటు అంతకుమించి అనే రేంజ్ లోనే కామెడీ ఎంటర్టైన్మెంట్ కూడా పొందుతున్నారు బుల్లితెర ప్రేక్షకులు. దీంతో ఢీ షో వస్తుంది అంటే చాలు టీవీలకు అతుక్కుపోయి ఈ కార్యక్రమం వీక్షిస్తున్నారు అనీ చెప్పడంలో అతిశయోక్తి లేదు. కాగా ప్రస్తుతం ప్రసారం అవుతున్న ఢీ 13వ సీజన్ చివరి అంకానికి చేరుకుంది. ఇక ఈ వారం గ్రాండ్ ఫినాలే ప్రసారం కాబోతుంది. అయితే గ్రాండ్ ఫినాలే కి ఒక స్పెషల్ గెస్ట్ ని పిలవడం జరుగుతుంది అనే విషయం తెలిసిందే.




 ఇక ఈ సారి గ్రాండ్ ఫినాలే కి స్పెషల్ గెస్ట్ గా  అల్లు అర్జున్ ను పిలిచారు. అయితే దాదాపు పదేళ్ల కిందట అల్లు అర్జున్ ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా వచ్చారు. ఇప్పుడు మరోసారి ఢీ స్టేజి మీదికి కనిపించబోతున్నారు ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్. అయితే ఇక అల్లుఅర్జున్ రాబోతున్నారు అంటూ అటు నిర్వాహకులు వరుస ప్రోమోలు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించి రెండు ప్రోమోలు విడుదల కాగా ఇక ఇప్పుడు మరో ప్రోమో కూడా విడుదలైంది. ఇక ఈ ప్రోమోలో భాగంగా అటు గ్రాండ్ ఫినాలే లో కంటెస్ట్ అదిరిపోయే డాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారు. ఇక ఆ తర్వాత ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్  స్టేజి మీదికి ఎంట్రీ ఇచ్చారు. ఇలా వరుస ప్రోమో లతో ఇక ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ పై ఒక్కసారిగా అంచనాలను పెంచేస్తున్నారు నిర్వాహకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: