తెలుగు సినిమా ఇండస్ట్రీలో బోలెడు మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నా..వాళ్లలో మనం కొందరిని మాత్రమే పేరుతో సహా గుర్తు పెట్టుకంటాం. అలాంటి వారిలో ఈ ప్రియ కూడా ఒక్కరు. ఈమె పూర్తి పేరు మామిళ్ల శైల‌జా ప్రియ. టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పని చేసి మంచి పేరునే సంపాదించుకుంది. అందరికీ గుర్తుండిపోయేలా ప్రియా తన నటనతో మెప్పించి మంచి మచి అవకాశాలు అందుకుంది. మొదట క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన ప్రియ.. ఆ తరువాత బుల్లితెర పై ఎన్నో సీరియల్స్ లో నటించి తనదైన నటనతో స్మాల్ స్క్రీన్ పై కూడా చెరగని ముద్ర వేసుకుంది. ఇక ఈమె సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ ఇం డస్ట్రీలో ఉన్న హీరోయిన్ కి కూడా లేదనే చెప్పాలి.

రీసెంట్ గా ఈమె బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళింది.  బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ గా హౌస్ లో ఫుల్ ఎంటర్ టైన్ చేసి..ఎలిమినేట్ అయ్యి తన ఇంటికి వచ్చేసింది. శైల‌జ‌కు తిరుగులేని అంద చందాల‌తో పాటు అద్భుత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉండడంతో ఆమెకు ఇంకా అవకాశాలు వస్తున్నాయి. కాగా, బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యాక  బయటకు వచ్చిన తర్వాత ఈమె పాపులారిటీ డబుల్ అయ్యిందనే చెప్పాలి. ప్రస్తుతం ఈ ఆంటీ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది.  

బిగ్ బాస్ ద్వారా మరింత  పాపులారిటీ సంపాదించుకున్న ప్రియ ఆంటీ కి స్టన్నింగ్ ఆఫర్ వచ్చిన్నట్లు సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతుంది. ప్రియ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమాలో ఛాన్స్ కొట్టేసిన్నట్లు తెలుస్తుంది. నాగ్ అశ్విన్ డైరెక్షన్  లో ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న.. ఈ సినిమాలో ప్రియ ఈ కీలక పాత్రల్లో నటించనున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇది వరకే వీళ్లిద్దరు కలిసి మిర్చి సినిమాలో నటించారు . గతంలో ఎన్నో సినిమాలో నటనతో తన అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ తో మనల్ని మెప్పించిన ఈ ఆంటీ కి ఇలాంటి పెద్ద సినిమాలో అవకాశం రావడానికి కారణం బిగ్ బాస్ నే అంటున్నారు నెటిజన్స్. మరి చూడాలి ప్రియ ఈ సినిమాలో ఎలా నటిస్తుందో..?
 

మరింత సమాచారం తెలుసుకోండి: