నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన 'అఖండ' సినిమా డిసెంబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి 70 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా.. సీరియల్ హీరో శ్రీకాంత్ ఈ సినిమాలో విలన్ పాత్ర పోషించాడు. జగపతిబాబు, పూర్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బ్లాక్బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. నందమూరి అభిమానులతో పాటు మాస్ ఆడియన్స్ను ఈ సినిమా విపరీతంగా ఆకట్టుకుంటుంది.

ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్న తరహా పాత్రలతో మెప్పించాడు. సినిమాలో ఓ వైపు మురళీకృష్ణ అనే గ్రామ పెద్దగా ను మరోవైపు అఖండ అనే అఘోరగాను మెప్పించి తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ సినిమా కేవలం ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా ప్రభంజనం సృష్టిస్తోంది. యూ.ఎస్ లో ఈ సినిమా భారీ కలెక్షన్స్ను కొల్లగొడుతుంది. ప్రపంచవ్యాప్తంగా అఖండ సినిమా సుమారు 1550 థియేటర్లకు పైగా విడుదలై బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబడుతోంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఆఖండ సినిమాను వీక్షించేందుకు ఏకంగా ఘోరాలు కదిలి వచ్చారు. బాలయ్య సినిమాను చూడటానికి అఘోరాలు రావడం అందర్నీ ఒక్కసారిగా ఆశ్చర్యంలో ముంచెత్తింది.

అఘోరాలు ఈ సినిమాను వీక్షించేందుకు విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలోని బంగార్రాజు థియేటర్లో సందడి చేశారు. దీంతో అఘోరాలు సైతం బాలయ్య ఫ్యాన్స్ అయ్యారంటూ అభిమానులు కేకలు వేశారు. పైగా సినిమా చూసిన అనంతరం బాలయ్య ఫ్యాన్స్ తో అఘోరాలు కాసేపు ముచ్చటించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.దీంతో ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో సందడి చేస్తున్న ఈ సినిమా బలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని రాబట్టి సరికొత్త రికార్డుని నెలకొల్పింది. దీంతో బాలయ్య ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: