తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రేక్షకులను సినీ సెలబ్రిటీలను అందరినీ అవాక్కయ్యేలా చేసిన అంశం ఒక్కటే. అదే సమంత నాగచైతన్య విడాకుల గురించి ఎన్నో రోజుల నుంచి సమంత నాగచైతన్య విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఎంతో అన్యోన్యంగా ఉండే వీరిద్దరూ విడాకులు తీసుకోవడం ఏంటి.. ఈ మీడియా వాళ్ళు సోషల్ మీడియాలో ఎప్పుడూ సినీ సెలబ్రిటీల ఏదో ఒకటి రాస్తూనే ఉంటారు అని అనుకుంటారు చాలా మంది. కానీ ఆ తర్వాత సమంత నాగచైతన్య విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించడంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు.


 ఏంటి ఇన్ని రోజుల వరకు మీడియాలో వచ్చింది నిజమేనా అని అవాక్కయ్యారు. అయినా సమంత నాగచైతన్య విడాకులు తీసుకోవడం ఏంటి ఇద్దరూ విడాకులు తీసుకోవడానికి ఇంత పెద్ద కారణం ఏముంది అంటూ ఆలోచనలో పడిపోయారు. ఏం జరిగిందా అని సోషల్ మీడియా వేదికగా వెతకడం ప్రారంభించారు. అయితే విడాకులకు సంబంధించిన పోస్టులు పెట్టిన తర్వాత ఇప్పటివరకు విడాకులపై ఎక్కడ నాగచైతన్య సమంత స్పందించలేదు. కానీ ఇటీవలే మొదటి సారి సమంత తన విడాకులపై స్పందించినట్లు తెలుస్తోంది.



 విడాకులు తీసుకున్న సమయం లో కుంగి పోయి ఏకంగా చని పోతానేమో అని అనుకున్నాను అంటూ సమంత ఎమోషనల్ కామెంట్స్ చేశారట. నేను బలహీనమైన వ్యక్తిని అనీ నా ఫీలింగ్.. కానీ నేను ఇంత బలంగా ఉన్నట్లు తెలిసి ఇప్పుడు ఆశ్చర్యం వేస్తుంది అంటూ సమంత చెప్పు కొచ్చింది. నేను ఇంత దృఢం గా ఉండగలను అని మాత్రం ఊహించలేదు అంటూ సమంత తెలిపింది. ఇటీవల ఒక ఇంగ్లీష్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత ఇక ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా సమంత నాగచైతన్య విడాకులు తీసుకోవడానికి కారణం ఏమై ఉంటుందా అన్నది మాత్రం ప్రేక్షకులకు అంతుచిక్కని ప్రశ్నగా మారి పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: