టాలీవుడ్ కి ఆ సత్తా ఉంది. సామర్ధ్యం ఉంది. ఏ భాషా చిత్ర సీమకు లేని ఎన్నో ఆయుధాలు ఒక్క తెలుగు సినీ సీమకే ఉన్నాయి. ఇక ఆకాశమే హద్దు అన్నట్లుగా సాహసం చేయలన్నా కలెక్షన్ల సునామీ సృష్టించాలన్న కూడా టాలీవుడ్ కే సాధ్యం.

ఇక టాలీవుడ్ లో సీనియర్ టాప్ హీరోలతో పాటు సూపర్ స్టార్స్, మిడిల్ రేంజి హీరోలు, చిన్న హీరోలు ఇలా అంతా కలుపుకుంటే పాతిక ముప్పయికి తక్కువ కాకుండా ఉంటారు. ఇది నిజంగా టాలీవుడ్ బలమే అని చెప్పాలి. ఇందులో సగానికి సగం మంది హీరోలు కలెక్షన్ల వెల్లువనే క్రియేట్ చేయగలరు.

ఇక భారీ బడ్జెట్ మూవీస్ తీయాలన్నా వేగంగా సినిమాలు తీయాలన్నా టెక్నికల్ గా అప్ గ్రేడ్ కావాలన్న టాలీవుడ్ తరువాతే ఎవరైనా. అలాంటి టాలీవుడ్ కి తెలుగు  సినీ అభిమానులు పెట్టని కోట. కరోనా ఫస్ట్ సెకండ్ వేవ్ ల తరువాత ఎక్కడా లేని విధంగా బ్లాక్ బస్టర్ హిట్స్ ఒక్క టాలీవుడ్ కే సాధ్యమన్నట్లుగా సీన్ ఉంది. ఇక ఇపుడు వరసబెట్టి మూవీస్ వస్తున్నాయి.

అవన్నీ కూడా భారీ సినిమాలే. పుష్పతో మొదలుపెడితే ట్రిపుల్ ఆర్, భీమ్లా నాయక్. రాధేశ్యామ్ వంటి సినిమాలు కలెక్షన్లతో కుమ్మేయడం ఖాయం. అయితే ఇక్కడే టాలీవుడ్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సినిమాలు అన్నీ కూడా ఒకేసారి క్యూ కట్టి వస్తే వారిలో వారికే పోటీ ఏర్పడి కలెక్షన్ల మీద ఆ ప్రభావం దారుణంగా పడుతుంది. అందువల్ల జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఈ సంక్రాంతిని జాగ్రత్తగా వాడుకుంటే టాలీవుడ్ దశ తిరిగినట్లే. అలాగే తరువాత వచ్చే సినిమాలు కూడా మినిమం గ్యాప్ ని మెయింటెయిన్ చేస్తే తప్పకుండా టాలీవుడ్ గత ప్రాభవంతో కళకళలాడడం ఖాయం. ఈ విషయంలో ఇగోలకు, ఇతర విషయాలకు పోకుండా అంతా ఒక్క త్రాటి మీదకు రావాలి. అలాగే ఎవరి సినిమా హిట్ అయినా అంతా హ్యాపీగా ఫీల్ అవాలి. అందరి సినిమా హిట్ కోసం ఎవరి మటుకు వారు హెల్ప్ చేస్తే ఇంకా మంచిది.




మరింత సమాచారం తెలుసుకోండి: