సోషల్ మీడియాను ఉపయోగించుకుని బాగా పాపులారిటీ సంపాదించిన సినీ సెలబ్రిటీ ఎవరు అంటే ముందుగా వినిపించే పేరు అషు రెడ్డి. సోషల్ మీడియాలో జూనియర్ సమంత గా పేరు తెచ్చుకొని టిక్ టాక్ లో ఫేమస్ అయింది. ఇక ఆ తర్వాత ఏకంగా బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా అవకాశం దక్కించుకుంది అషు రెడ్డి. బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత ఏ రేంజ్ లో క్రేజ్  పెరిగిపోతుంది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బిగ్బాస్ రియాలిటీ షోతో సెలబ్రిటీ హోదా తెచ్చుకున్న అషు రెడ్డి అప్పటినుంచి సోషల్ మీడియాలో రచ్చ చేస్తూనే ఉంది. ముఖ్యంగా రాంగోపాల్ వర్మ తో  చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ అయితే సోషల్ మీడియాను ఉపేసింది  అని చెప్పాలి.


 రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ తర్వాత బోల్డ్ బ్యూటీ గా ఈ అమ్మడికి ఒక ముద్ర పడిపోయింది. అదే సమయంలో ఎంతో హాట్ హాట్ ఫోటో షూట్లతో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది అషు రెడ్డి.. ఇకపోతే ఇటీవల అషు రెడ్డి కి సంబంధించిన ఒక వీడియో సంచలన గా మారిపోయింది. ఇందులో అషు రెడ్డి ప్రెగ్నెంట్ అని చెప్పింది. అయితే ఇక ఫ్యాన్స్ అందరూ అషు రెడ్డి తీరుపై ప్రస్తుతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అషు రెడ్డి కి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అన్న విషయం తెలిసిందే.


 యూట్యూబ్ ఛానల్ లో పలు వీడియోను చేస్తూ ఉంటుంది.. అయితే ఇక తన చానల్ ను మరింత ఫేమస్ చేయాలనుకుందో ఏమో ఒక దారుణమైన ఆలోచన చేసింది అషు రెడ్డి. ఇక ఈ వీడియో చూసిన వారు అందరూ  తిట్టిపోస్తున్నారు అని చెప్పాలి. ఇటీవలే ఫ్రాంక్ వీడియోలు సోషల్ మీడియాలకు బాగా క్రేజ్ వచ్చింది. దీంతో అషు రెడ్డి కూడా తన తల్లిని ఫ్రాంక్ చేయాలని భావించింది. దీనికోసం ఒక పిచ్చి ఐడియా పాలో అయింది. ఏకంగా తాను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని అందరి ముందు చెప్పింది. సోఫాలో కూర్చుని కన్నీళ్లు పెట్టుకుంటూ అషు రెడ్డి ఉన్న సమయంలో..  తల్లి దగ్గరికి వచ్చి ఏం జరిగింది అంటూ ప్రశ్నిస్తోంది. పీరియడ్స్ రాలేదు మమ్మీ టెస్ట్ చేసుకుంటే ప్రెగ్నెంట్ అని రిపోర్ట్ వచ్చింది అంటూ తల్లికి చెబుతుంది అషు రెడ్డి. దీంతో కుటుంబ సభ్యులు అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.  చివరలో ఇదంతా ఫ్రాంక్ అంటూ కెమెరా లు చూపిస్తుంది. అయితే ఇది చూసిన కొంతమంది క్రేజీగా ఉంది అంటూ కామెంట్ చేస్తుంటే..పాపులారిటీ కోసం ఇంత దిగజారడం అవసరమా అంటూ మరికొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: