ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చినప్పటికీ మోడలింగ్ తో పాటు పలు సినిమాలో నటించినా రాని గుర్తింపు బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంటర్ అవ్వగానే వచ్చింది నటి దివికి, ఈ సొట్ట బుగ్గల సుందరి బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో చేసిన అందాల విందుకు యూత్ ఫిదా అయిపోయారు. హౌజ్ కే ఫుల్ గ్లామర్ ను తెచ్చిన ఈ పొడవు కాళ్ళ వయ్యారి తెలుగు ప్రజల మనసు దోచుకుంది. అయితే ఆఫ్టర్ బిగ్ బాస్ ఈమె కెరియర్ గ్రాఫ్ పరుగులు తీస్తోంది. ఊహించని ఆఫర్లతో ఫుల్ బిజీ అయిపోయింది దివి. ఫోటో షూట్ లు, మోడలింగ్ ఇలా ఫుల్ టైట్ షెడ్యుల్ అయిపోయింది.

కాగా ప్రస్తుతం ఈమె 'నయీం డైరీస్' చిత్రంలో హీరోయిన్ గా చేస్తున్న విషయం తెలిసిందే. అండర్ వరల్డ్ డాన్ నయీం నిజ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాలో గ్లామర్ ను ఫుల్ గా ఒలికించేస్తుంది ఈ అందాల తార.  ఈ మూవీలో నయీం (వశిష్ట సింహ)  భార్యగా కనిపించనున్న దివి గ్లామర్ బార్డర్ ను పూర్తిగా దాటేసారనే అంటున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక రొమాంటిక్ వీడియోని విడుదల చేసింది చిత్ర బృందం ఇందులో వశిష్ట సింహ, దివి వద్యా మధ్య రొమాంటిక్ సీన్లు హీటెక్కిస్తున్నాయి.

ముఖ్యంగా బెడ్ రూమ్ సీన్లో దివి రెచ్చిపోయి నటించేసింది అంటూ కామెంట్లు వినపడుతున్నాయి. పాత్ర డిమాండ్ చేస్తే దేనికీ వెనుకాడను అన్న దివి నిజంగానే నటన కోసం ప్రాణం పెట్టిస్తోంది. మరి ఈ సినిమా ఆమెకు కెరియర్ పరంగా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. అయితే ఇప్పటి వరకు దివి కి సరైన పాత్రా ఏదీ పడలేదు. ఈ సినిమా అయినా తనకు ఒక నటిగా మంచి పేరును తెచ్చి భవిష్యత్తులో ఇంకా అవకాశాలు వస్తాయేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: