ఇక ప్రస్తుతం బాలయ్య గోపీచంద్ మల్లినేని డైరెక్షన్ లో యాక్షన్ జోనర్ లో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య పక్కన శృతి హాసన్ జోడీ కడుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ కోసం ఎందరో సుందరిమణులను ట్రై చేసిన గోపీచంద్ మల్లినేని ఫైనల్ గా తన లక్కీ హీరోయిన్ శృతి హాసన్ ను ఫిక్స్ చేసారు. శృతి కూడా బాలయ్య పక్కన హుందాగా కనిపించడానికి , ఆయన తో లుక్స్ మ్యాచ్ అవ్వడానికి బరువు కూడా పెరుగుతుందంటూ ఓ వార్త నెట్టింట షికారు చేస్తుంది.
కాగా, ఈ సినిమాని చేస్తునే బాలయ్య అని అనీల్ రావిపూడి డైరెక్షన్ లో ఓ సినిమా చేయడానికి కమిట్ అయ్యారు. ఇక ఈ క్రేజీ కాంబినేషన్ కోసం బాలయ్య అభిమానులు ఎప్పటి నుండో ఎదురుచూస్తున్నారన్న విషయం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇక ఈ సినిమాలో బాలయ్య ఇద్దరు హీరోయిన్స్ తో రొమాన్స్ చేయనున్నారని తెలుస్తుంది. అందులో కుర్ర హీరోయిన్ మెహ్రీన్ ఒక్కరు అంటూ సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం. మెహ్రీన్ కు అనీల్ రావిపూడికి మంచి కనెషన్ ఉంది. ఈమె అనీల్ డైరెక్షన్ లో ఇప్పటికే ఎఫ్2 అనే సినిమా చేసింది. అంతేకాదు ఆ సినిమాకి సీక్వెల్ గా ఎఫ్3 లో కూడా నటిస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి