బుల్లి తెరపై సందడి చేస్తూ తమదైన వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటున్న యాంకర్లు మాత్రమే కాదు స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారు సైతం ఓటిటీ వేదికగా షోలు నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా గత కొంత కాలం నుంచి ఆహా ఓటీటీ వేదికగా వరుసగా ఎన్నో ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు ప్రసారం అవుతూ ఉన్నాయి. నందమూరి బాలకృష్ణ unstoppable కార్యక్రమం చేస్తుండగా.. శ్రీముఖి చెఫ్ మంత్ర అనే కార్యక్రమాన్ని చేస్తుంది. ఇక ప్రదీప్ సర్కార్ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారడు.
ఇకపోతే ప్రస్తుతం తెలుగు బుల్లితెర పై నెంబర్ వన్ యాంకర్ గా కొనసాగుతున్న ప్రదీప్ చేస్తున్న సర్కార్ కార్యక్రమం ప్రేక్షకులను అలరిస్తుంది అని చెప్పాలి. ఇకపోతే ఇటీవలే సర్కార్ కార్యక్రమానికి సంబంధించిన ఎనిమిదవ ఎపిసోడ్ ప్రోమో సోషల్ మీడియా లో విడుదలై వైరల్ గా మారిపోయింది. ఈ ప్రోమో లో భాగంగా ప్రియమణి, వర్షిని,రష్మీ, బాబా భాస్కర్ మాస్టర్ స్పెషల్ గెస్ట్ లుగా వచ్చారు. ఈ క్రమంలోనే ఎవరికీ తెలియని ప్రశ్నలు అడిగిన ప్రదీప్ రష్మీ ని టెన్షన్ పెట్టాడు. ఇక ప్రదీప్ అడిగిన ప్రశ్నతో అటు ప్రియమణి సైతం షాక్ అయింది అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి