బుల్లితెర ప్రేక్షకులు అందరినీ ఆకర్షిస్తున్న బిగ్బాస్ చివరి అంకానికి చేరుకుంది. ఇంకొక రోజులో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరు అన్నది తెలిసిపోయింది. ఇక 100 రోజుల నుంచి బిగ్బాస్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఇక ఫైనల్ ఎపిసోడ్ ఎంతో గ్రాండ్గా ప్లాన్ చేశారు.. ఈ క్రమంలోనే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ఐదు మంది కంటెస్టెంట్ లలు బిగ్ బాస్ విన్నర్ ఎవరు అన్నది కూడా ప్రస్తుతం ఎంతో ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి.


 ఇక బిగ్బాస్ కార్యక్రమంపై కేవలం బిగ్బాస్ నిర్వాహకులు మాత్రమే కాదు అఫిషియల్ గా అటు ఎన్నో యూట్యూబ్ ఛానల్లు వివిధ మీడియా సంస్థలు కూడా సర్వేలు నిర్వహిస్తూ ప్రేక్షకులు అభిప్రాయాలను తెలుసుకుంటూ ఉన్నాయి.  అయితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు అందరూ కూడా బిగ్ బాస్ హౌస్ లో తమ అభిమాన కంటెస్టెంట్ కి ఓటు వేసి మద్దతు తెలిపారు. ఓటింగ్ ప్రక్రియ పూర్తి అయింది. ఇప్పుడు దాదాపు బిగ్బాస్ ఐదో సీజన్ విన్నర్ ఎవరు అనే దానిపై క్లారిటీ వచ్చే ఉంటుంది.


 ఇకపోతే ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం బిగ్ బాస్ హౌస్ లో అదిరిపోయే ఎంటర్ టైనర్ గా పేరుతెచ్చుకున్న సన్నీ బిగ్బాస్ ఐదవ సీజన్ విన్నర్ గా నిలవబోతున్నాడు అంటూ టాక్ వినిపిస్తోంది. గత కొన్ని రోజుల నుంచి యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన సర్వేలో ఇతర చానళ్ల చర్చల  ద్వారా ప్రస్తుతం సన్నీ అందరికంటే ఎక్కువ ఓటింగ్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. సన్నీకి 34 శాతం ఓట్లు రాగా అటు షణ్ముఖి 31 శాతం ఓటింగ్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఆ తర్వాత స్థానాల్లో శ్రీ రామచంద్ర మానస్ సిరి ఉన్నారట. ఇక ఈ ఓటింగ్ చూసిన తర్వాత సన్నీ విన్నర్ అంటూ ఫిక్స్ అయిపోతున్నారు. కానీ ఇది ఎంతవరకు నిజం అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: