మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, నందమూరి వారసుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలసి నటించిన తాజా చిత్రం "ఆర్ ఆర్ ఆర్". ఈ చిత్రం న్యూ ఇయర్ కానుకగా జనవరి 7, 2022 న మన ముందుకు రానుంది. విడుదలకు ముందే ఈ సినిమా సంచలన రికార్డులను సృష్టిస్తూ ప్రేక్షకులలో ఆసక్తిని మరింత పెంచేస్తోంది. ఈ సినిమాకు ఇప్పటికే కోట్లల్లో బిజినెస్ జరిగిపోయింది, రిటర్న్స్ కూడా అంచనాలకు మించి ఉన్నాయని సమాచారం. టాలీవుడ్ తెరపై రూపుదిద్దుకున్న ఈ సినిమా తెలుగుతో పాటుగా  హిందీ , తమిళ్ , కన్నడ ఇలా పలు భాషల్లో విడుదల కానున్న విషయం తెలిసిందే.   ఇక యు ఎస్ ఏ లో ఈ సినిమా జోరు మామూలుగా లేదట. అక్కడ కూడా అడ్వాన్స్ బుకింగ్ లు ప్రారంభం కాగా బుకింగ్స్ ఓపెన్ అయిన కాసేపటికే హౌజ్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయట.

ప్రీమియర్‌ల ప్రీ సేల్స్ విషయానికొస్తే  $175K వరకు జరిగాయట. ఈ సినిమా కేవలం కొన్ని గంటల్లోనే $175K వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ సినిమా ప్రీ బుకింగ్స్ చూస్తే  ఇతర తెలుగు సినిమా విడుదలకు ముందు అడ్వాన్స్ బుకింగ్స్ నుండి $175K ఈ రేంజ్ లో వసూలు రాబట్టలేదని అంటున్నారు. ఇలా విడుదలకు ముందే అని విషయాలలోనూ పాపులారిటీని సంపాదించుకుంటున్న 'ఆర్ ఆర్ ఆర్' బాక్స్ ఆఫీస్ వద్ద ఏ విధమైన రిజల్ట్ అందుకుంటుందన్న టెన్షన్ అందరిలోనూ నెలకొంది.

రాజమౌళి తన ప్రతి సినిమాలో తనదైన గ్రిప్పింగ్ స్టోరీ, స్క్రీన్ ప్లే తో ఆకట్టుకుంటూ వస్తున్నాడు. ఇప్పటి వరకు సినిమా నుండి విడుదలైన ప్రతి ఒక్క పోస్టర్, టీజర్, పాటలు అన్నీ కూడా సినిమా ఫలితాన్ని కళ్ళకు కట్టింస్టులు చూపిస్తున్నాయి. కానీ ప్రేక్షకులు ఇచ్చే అసలైన తీర్పు కోసం ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే. అయితే రాజమౌళి సినిమా అంటే ఖచ్చితంగా హిట్ అవుతుంది, ఇక్కడ అది సమస్య కాదు. ఎన్ని వందల కోట్లు కలెక్షన్స్ సాధిస్తుంది అన్నదే. మరి ఈ సారి తాను ఎన్నని రికార్డులు బద్దలు కొడతాడా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: