తెలుగు హీరోలంతా కూడా పాన్ ఇండియా సినిమాలతో సందడి చేస్తుంటే ఆ లిస్ట్ లో వెనకపడ్డాడు సూపర్ స్టార్ మహేష్. ఎప్పుడైనా పాన్ ఇండియా సినిమా ఎప్పుడు చేస్తారని మీడియా అడిగినా సరే ఇక్కడ చేయాల్సినవే చాలా ఉన్నాయ్ అని తప్పించుకుంటాడు మహేష్. స్పైడర్ తో తెలుగు, తమిళ బైలింగ్వల్ ప్రయత్నం చేసిన మహేష్ ఇక మిగతా సినిమాలన్ని కేవలం తెలుగులోనే రిలీజ్ చేశాడు.

ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్న మహేష్ ఆ సినిమా తర్వాత రాజమౌళితో క్రేజీ మూవీ లైన్ లో ఉంది. ఇక మహేష్ ఆ సినిమాతోనే నేషనల్ లెవల్ ఆడియెన్స్ ను పలకరించే అవకాశం ఉందని చెప్పొచ్చు. మహేష్ తో జక్కన్న మూవీ ఎలా ఉంటుంది అని పాన్ ఇండియా లెవల్లో డిస్కషన్స్ జరుగుతున్నాయి. కేవలం తెలుగు సినిమాలే చేసినా మహేష్ బాబుకి నేషనల్ వైడ్ గా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే రాజమౌళి సినిమాతోనే పాన్ ఇండియా అటెంప్ట్ చేయాలని ఫిక్స్ అయ్యాడు మహేష్.

ఇక తెలుగు సినిమా స్థాయిని పెంచుతూ వస్తున్న జక్కన్న బాహుబలితో తిరుగులేని రికార్డులు సృష్టించగా ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ తో అదే సీన్ మళ్లీ రిపీట్ అయ్యేలా చేస్తున్నాడు. ట్రిపుల్ ఆర్ తర్వాత మహేష్ తోనే రాజమౌళి సినిమా ఉండబోతుంది. ఈ సినిమా నేపథ్యం ఏంటి.. ఎంత బడ్జెట్ లో చేస్తున్నారు అన్న విషయాల మీద త్వరలోనే ఓ క్లారిటీ వస్తుందని తెలుస్తుంది. ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ అవగానే మహేష్ సినిమా మీద తన ఫోకస్ పెట్టనున్నాడు రాజమౌళి. మహేష్ తో రాజమౌళి సినిమా కూడా ఆర్.ఆర్.ఆర్ ను మించి రికార్డులు బద్ధలు కొట్టే సినిమా అయి తీరుతుందని గట్టిగా ఫిక్స్ అయ్యారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. ఆర్.ఆర్.ఆర్ అనుకున్న టార్గెట్ రీచ్ అయితే మహేష్ సినిమా ఆటోమెటిక్ గా భారీ స్థాయిలో ఉంటుంది ఆ లెక్క మాత్రం తగ్గదని ఫిక్స్ అవ్వొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: