ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం అయిన`పుష్ప`. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించారని అందరికి తెలిసిందే.

అలాగే ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించగా మలయాళ హీరో ఫహాద్‌ ఫాజిల్ మరియు సునీల్ విలన్ పాత్రలను పోషించారని తెలుస్తుంది.. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోందని సమాచారం.

అయితే మొదటి పార్ట్‌ను పుష్ప ది రైజ్ పేరుతో డిసెంబర్ 17న తెలుగుతో పాటు తమిళ్‌ మరియు కన్నడ, మలయళ అలాగే హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేయగా డివైట్ టాక్‌ను సొంతం చేసుకుందని తెలుస్తుంది.అయినప్పటికీ కలెక్షన్ల పరంగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ముదులిపేసిందని తెలుస్తుంది.తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ మరియు అమెరికాలోనూ కూడా భారీ వసూళ్లు రాబడుతోందని తెలుస్తుంది..

అయితే ప్రస్తుతం పుష్పరాజ్‌కు జోరుకు బ్రేకులు పడ్డాయని తెలుస్తుంది.ముఖ్యంగా మంగళవారం కలెక్షన్స్ భారీగా డ్రాప్ అయ్యాయని సమాచారం.బాలీవుడ్‌లో బాగానే దూసుకుపోతున్నా కూడా సౌత్‌లో మాత్రం పుష్ప తేలిపోయిందని తెలుస్తుంది.. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక మరియు తమిళనాడు అలాగే కేరళలో ఈ చిత్రం మంచి వసూళ్లు రాబట్టిందని తెలుస్తుంది. కానీ సెకెండ్ వీక్ వచ్చే సరికి అక్కడ కూడా కలెక్షన్లు పడిపోతున్నాయని సమాచారం.

టిక్కెట్ ధరల సమస్యలు మరియు ఏపీలో థియేటర్ల మూసివేత వంటి అంశాలు పుష్ప కలెక్షన్లు తీవ్రంగా దెబ్బ తీస్తున్నాయని అంటున్నారని తెలుస్తుంది.. ఏదేమైనప్పటికీ కూడా ఓ పాన్ ఇండియా చిత్రం రెండో వారానికే చతికిల పడటం చిత్రయూనిట్‌కి బిగ్ షాకనే చెప్పవచ్చని తెలుస్తుంది.డిసెంబర్ 24 న అనగా ఈ రోజున నాని నటించిన శ్యామ్ సింగ రాయ్ విడుదలవుతుందని తెలుస్తుంది. ఈ సినిమా మంచి టాక్ వస్తున్నట్లు సమాచారం అందిందట. దీని కలెక్షన్ ఎఫెక్ట్ పుష్ప పై పడనుందని తెలుస్తుంది. చూడాలి మరి ఎం జరుగుతుందో...!

మరింత సమాచారం తెలుసుకోండి: