టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన లేటెస్ట్ భారీ పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్ జనవరి 7న అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో అలానే రామ్ చరణ్ అల్లూరి సీతంరామరాజు పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో జెన్నిఫర్ గా హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్, అలానే సీతగా బాలీవుడ్ నటి అలియా భట్ నటిస్తుండగా అజయ్ దేవగన్, సముద్ర ఖని, రాహుల్ రామకృష్ణ, రాజీవ్ కనకాల, శ్రీయ తదితరులు ఇతర పాత్రలు చేస్తున్నారు.

మరోవైపు ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా పాటలు, ఇద్దరు హీరోల టీజర్లు, థియేట్రికల్ ట్రైలర్ అందరి నుండి మంచి స్పందన రాబట్టడంతో పాటు భారీ అంచనాలు ఏర్పరిచాయి. ఇక త్వరలో సినిమా రిలీజ్ దగ్గర పడుతూ ఉండడంతో మరోవైపు మూవీ ప్రమోషనల్ కార్యక్రమాల పై బాగా దృష్టి పెట్టిన ఆర్ఆర్ఆర్ యూనిట్ ప్రస్తుతం వాటి పనుల్లో ఎంతో బిజీగా ఉంది. అందులో భాగంగా నేడు ఒక ప్రముఖ మీడియా సంస్థ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూ లో భాగంగా దర్శకుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ గురించి మాట్లాడుతూ, ఈ సినిమాకి రప్పించడానికి ఎన్టీఆర్, చరణ్ ల స్టార్ ఇమేజ్ లు ఉపయోగపడతాయి, అనంతరం థియేటర్స్ కి వచ్చిన ప్రేక్షకాభిమానులకి సినిమా నచ్చేవిధంగా ఉంటేనే అది వారిని అలరిస్తుంది, ఆ విధంగా మెజారిటీ ప్రేక్షకులని మెప్పించేలా తామందరం ఆర్ఆర్ఆర్ సినిమా తీసాం అనే భావిస్తున్నాం అని, అయితే అది ఏ స్థాయిలో ఆడియన్స్ మెప్పు అందుకుంటుంది అనేది మాత్రం రిలీజ్ తరువాతనే తెలుస్తుందని అన్నారు.

ఇక సినిమాలో ఎన్నో యాక్షన్, ఫైట్స్, ఎమోషనల్ సన్నివేశాలు ఉన్నాయని, అయితే వాటిలో ముఖ్యంగా కొన్ని కీలక సన్నివేశాల దగ్గర ఎన్టీఆర్, చరణ్ ల నటన, ఎమోషన్స్ నిజంగా ఆడియన్స్ గుండెని తాకుతాయని ఆయన అన్నారు. దాదాపుగా ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో గుర్తుండిపోయే ముఖ్య ఘటనలు ఉంటాయని, అయితే అటువంటి వాటిలో ముఖ్యమైన వాటిలో కలిగే ఎమోషన్ ని మనం మాత్రం ఎప్పటికీ మరచిపోలేము అని చెప్పుకొచ్చారు రాజమౌళి. మొత్తంగా రోజురోజుకు తమ సినిమా ప్రమోషన్స్, పబ్లిసిటీని మరింతగా పెంచుతూ రిలీజ్ లోపు తమ సినిమాని మరింతగా ప్రజలకు చేరువ చేసేలా ఆర్ఆర్ ఆర్ టీమ్ గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. మరి అందరిలో ఎన్నో భారీ అంచనాలు ఏర్పరిచిన ఈ భారీ సినిమా రేపు రిలీజ్ తరువాత ఎంత మేర సక్సెస్ కొడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: