పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దేవయాని జంటగా నటించిన క్లాసికల్ హిట్ మూవీ 'సుస్వాగతం'. ప్రకాష్ రాజ్, రఘువరన్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాని భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. 1998 జనవరి 1వ తేదీన ఈ సినిమా విడుదలైంది. యూత్ కి మంచి సందేశాన్ని అందించిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ క్లైమాక్స్ లో చెప్పిన డైలాగ్ లు ఎంతో ఎమోషనల్గా ఉంటాయి. అవి ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఎస్ ఏ రాజ్ కుమార్ ఈ సినిమాకి సంగీతం అందించారు. ఇక ఈ సినిమాతో పాటు అదే సంవత్సరం 'ఓ పనై పోతుంది బాబు' అనే సినిమా వచ్చింది. శివనాగేశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రవితేజ, సురేష్ హీరోలుగా నటించారు.

అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక ఇదే సినిమాకి కేవలం ఆరు రోజుల ముందు అంటే డిసెంబర్ 26న జగపతిబాబు రాశి జంటగా నటించిన 'పెళ్లి పందిరి' మూవీ వచ్చింది కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకి వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించారు. ఇక ఈ సినిమా మాత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఇక జనవరి 14న కృష్ణ, సుమన్ కలిసి నటించిన 'సంభవం' మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రోజా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ఎక్కువగా మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి. మోహన్ గాంధీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ యావరేజ్ ఫలితాన్ని అందుకుంది.

ఇక సరిగ్గా అదే రోజు మోహన్ బాబు నటించిన 'ఖైదీ గారు' సినిమా కూడా విడుదలైంది. ఇది కూడా బాక్సాఫీస్ వద్ద నిలువలేదు. అలాగే అదే సమయంలో ఎస్ వి కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన 'ఊయల' సినిమా కూడా విడుదలైంది. శ్రీకాంత్, రమ్యకృష్ణ, సుహాసిని హీరో, హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా యావరేజ్ అయింది. ఇక అదే నెలలో నాగార్జున, టబు జంటగా నటించిన 'ఆవిడ మా ఆవిడే' సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈవీవీ సత్యనారాయణ సినిమాకి దర్శకత్వం వహించారు. అయితే ఈ అన్ని సినిమాలలో పవన్ కళ్యాణ్ సుస్వాగతం మాత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ టాక్ తో పాటు మంచి కలెక్షన్స్ కూడా సాధించింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: