సినిమా టికెట్ల రేట్ల తగ్గింపుతో టోటల్ గా సినిమా పరిశ్రమ మూతపడే పరిస్థితి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకుంటోన్న చర్యలు, నిర్ణయాలు ఎన్నో వ్యవస్థల విధ్వంసానికి కారణమవుతున్నాయంటూ సోమి రెడ్డి వాపోయారు. జగన్ కేవలం ఇద్దరు , ముగ్గురు హీరోల మీద ఉన్న కక్షతోనే ఓవరాల్ గా పరిశ్రమను నాశనం చేసే నిర్ణయాలు తీసుకుంటున్నా రంటూ ఆయన మండి పడ్డారు.
ఇప్పటికే ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన టిక్కెట్ రేట్ల తో తాము థియేటర్లు రన్ చేయలేమని యజమానాలు వాపోతున్నారని.. గత నాలుగై దు రోజుల్లోనే రాష్ట్రంలో చాలా థియేటర్లు మూతపడ్డాయన్నాయని.. ఈ సంఖ్య ఇంకా పెరుగుతూ పోతోందని ఆయన చెప్పారు. సినిమా థియేటర్ల లో ఏమైనా గంజాయి అమ్ముతున్నారా ? అని ప్రశ్నించిన సోమిరెడ్డి .. నెళ్లూరు జిల్లా లో సూళ్లూరు పేటలో ఉన్న అతి పెద్ద థియేటర్ ను కూడా మూసి వేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారులు రాత్రి వేళల్లో థియేటర్లకు వెళ్లి దాడులు చేసి మూసివేసే హక్కు ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వానికి చేతనైతే నిత్యావసరాల రేట్లు తగ్గించి ప్రజలను ఆదు కోవాలని ఆయన పిలుపు ఇచ్చారు. ఇక పలువురు టీడీపీ నేతలు కూడా ఇప్పుడు ప్రభుత్వ తీరు తప్పు పడుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి