నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా బంగార్రాజు, ఈ సినిమాలో నాగార్జున సరసన రమ్యకృష్ణ హీరోయిన్ గా నటిస్తుండగా ఒక ముఖ్య పాత్రలో అక్కినేని నాగ చైతన్య కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నారు, ఈ సినిమాలో నాగ చైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది, ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల నుండి మంచి రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా ఈ సినిమాపై మంచి అంచనాలను పెంచాయి. బంగార్రాజు  సినిమా 2016 సంక్రాంతి కానుకగా విడుదలైన సోగ్గాడే చిన్నినాయన సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతోంది, బంగార్రాజు సినిమాను కూడా సోగ్గాడే చిన్నినాయన సినిమా లాగానే సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది,  తాజాగా ఈ చిత్ర బృందం ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అయినట్లు కూడా తెలియజేసింది.

ఇది ఇలా ఉంటే ఈ సినిమా నుండి ఇప్పటికే కొన్ని పాటలను చిత్ర బృందం విడుదల చేయగా ఈ పాటలకు జనాల నుండి మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. ఇది ఇలా ఉంటే బంగార్రాజు సినిమా నుండి విడుదల చేసిన పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్ అంటూ వాసివాడి తస్సాదియ్య అనే పాటకు అద్భుతమైన స్పందన వచ్చింది. నాగార్జున, నాగ చైతన్య కలిసి స్టెప్పులేసిన ఈ పాటలో ఫరియా అబ్దుల్లా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక ఈ పాట యూట్యూబ్ లో ఫుల్ హల్చల్ చేస్తోంది, ఇప్పటికే ఈ పాట 6 మిలియన్ వ్యూస్ కు పైగా సాధించి యూట్యూబ్ లో దూసుకుపోతుంది. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చగా అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: