తెలుగు చిత్ర పరిశ్రమలో జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరో గా కొనసాగుతున్నారు. తాతకు తగ్గ మనవడిగా ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో రాణిస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఇకపోతే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ అనే సినిమాలో నటించారు అన్న విషయం తెలిసిందే. ఈ సినిమా జనవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమా గురించి యావత్ భారత సినీ ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కాగా ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తూండగా జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నారు.


సినిమా విడుదలకు కొన్ని రోజుల సమయం మాత్రమే ఉండడంతో ప్రస్తుతం చిత్ర బృందం మొత్తం ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉంది. ఇక అన్ని భాషలలో కూడా సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ శరవేగంగా నిర్వహిస్తుండటం గమనార్హం. ఇక ఈ ప్రమోషన్స్ లో భాగంగా హీరోలు రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్లు ఎంతో సరదా సరదా సమాధానాలు చెబుతూ ప్రేక్షకులను ఆకర్షిస్తున్నారు. ఇకపోతే ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ తన లైఫ్ లో జరిగిన ఒక చేదు అనుభవం గురించి ఇటీవలే చెప్పుకొచ్చారు.


 ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూ జరిగింది. ఇక ఈ ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి కొన్ని కీలక విషయాలను పంచుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. 17 ఏళ్లకే సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాను అంటూ తెలిపాడు. అయితే రెండో సినిమాకి స్టార్ స్టేటస్ కూడా చూశాను. కొన్నాళ్ల తర్వాత వరుసగా సినిమాలు డిజాస్టర్గా మిగిలిపోయాయ్. దీంతో ఆ సమయంలో డిప్రెషన్లోకి వెళ్లి పోయాను అంటూ జూనియర్ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. ఆ సమయంలో వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న తనతో యమదొంగ లాంటి సూపర్ హిట్ సినిమా తీసి రాజమౌళి డిప్రెషన్ నుంచి బయటపడేశారు  అంటూ చెప్పుకొచ్చారు జూనియర్ ఎన్టీఆర్. ఇలా రాజమౌళి నన్ను సక్సెస్ ట్రాక్లో నిలబెట్టారు అంటూ తెలిపాడు జూనియర్ ఎన్టీఆర్.

మరింత సమాచారం తెలుసుకోండి: